Share News

Lok Sabha Polls 2024: ఈవీఎంలను ఎక్కడికి తరలిస్తారు.. 5 ఏళ్ల వరకు వాటికి భద్రత ఎందుకు?

ABN , Publish Date - May 13 , 2024 | 04:50 PM

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Polls 2024), పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ ముగిశాక ఈవీఎం మిషన్లను ఏం చేస్తారనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా. ఈవీఎంల(EVMs) భద్రత ఎలా ఉంటుంది, రీకౌంటింగ్‌కు పట్టుబడితే పరిస్థితి ఏంటి తదితర వివరాలు తెలుసుకుందాం.

Lok Sabha Polls 2024: ఈవీఎంలను ఎక్కడికి తరలిస్తారు.. 5 ఏళ్ల వరకు వాటికి భద్రత ఎందుకు?

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Polls 2024), పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ ముగిశాక ఈవీఎం మిషన్లను ఏం చేస్తారనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా. ఈవీఎంల(EVMs) భద్రత ఎలా ఉంటుంది, రీకౌంటింగ్‌కు పట్టుబడితే పరిస్థితి ఏంటి తదితర వివరాలు తెలుసుకుందాం. పోలింగ్ పూర్తైన వెంటనే ఈవీఎం యంత్రాలను పటిష్ట బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తారు. ఈవీఎం గదులు ఉన్న పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.

ఈవీఎం ఉన్న గదులకు మూడంచెల భద్రత ఉంటుంది. పోలింగ్‌లో ఉపయోగించిన ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్లతో పాటు పలు విలువైన పత్రాలను ఐదేళ్ల వరకు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. వీటన్నింటిని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచి సీల్ చేస్తారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన నాటి నుంచి 45 రోజుల పాటు జిల్లా ఎన్నికల అధికారి అధ్వర్యంలో భద్రత కల్పిస్తారు.


ఈవీఎంల భద్రతకు ఎన్నికల సంఘం అధికారులు స్ట్రాంగ్ రూంలలో పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తారు. ఈవీఎంల కంట్రోల్ యూనిట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలతో పాటు కేంద్ర బలగాలు రక్షణ కల్పిస్తాయి. గడువు ముగిసిన తర్వాత ఎన్నికల సంఘానికి అప్పగించి గోదాములకు తరలిస్తారు. ఇక అక్కడ మళ్లీ ఎన్నికల వరకు అంటే ఐదేళ్ల పాటు భద్రంగా నిల్వ చేస్తారు. ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత ఆయా యంత్రాల్లో డేటాను తొలగించి ఎన్నికల సంఘం అవసరానికి అనుగుణంగా దేశంలో ఎక్కడైనా తిరిగి మళ్లీ ఉపయోగించుకుంటారు.

5 ఏళ్ల పదవీకాలంలో గెలిచిన అభ్యర్థులపై ఓడిపోయిన అభ్యర్థులు ఆరోపణలు, ఫిర్యాదులు చేసే ఛాన్స్ ఉంటుంది. కొందరైతే పలు పోలింగ్ బూత్‌లలో రీకౌంటింగ్ జరపాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారు. కోర్టు లేదా ఎన్నికల సంఘం అదేశాలను అనుసరించి నిబంధనల మేరకు ఈ రీకౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. అందుకే 5 ఏళ్ల వరకూ ఈవీఎంలను భద్రపరుస్తారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2024 | 04:53 PM