Share News

Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా తొలి రెండు గంటల్లో నమోదైన పోలింగ్ శాతం ఇదే..

ABN , Publish Date - May 13 , 2024 | 11:13 AM

దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 94 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో ఒక్కోరకమైన పోలింగ్ శాతం నమోదైనట్లు ప్రధాన ఎన్నికల కమిషన్ వికాస్ రాజ్ వెల్లడించారు. తొలి రెండు గంటల్లో సగటున 10.35 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.

Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా తొలి రెండు గంటల్లో నమోదైన పోలింగ్ శాతం ఇదే..

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. తొలి రెండు గంటల్లో చాలా రాష్ట్రాల్లో 10 శాతానికిపైగా పోలింగ్ శాతం నమోదైంది. ఆంధ్ర ప్రదేశ్లో ఉదయం 9 గంటల వరకు 9.05శాతం ఓటింగ్ నమోదుకాగా.. తెలంగాణలో ఉదయం 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 94 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో ఒక్కోరకమైన పోలింగ్ శాతం నమోదైనట్లు ప్రధాన ఎన్నికల కమిషన్ వికాస్ రాజ్ వెల్లడించారు. తొలి రెండు గంటల్లో సగటున 10.35 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.


ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ పర్సంటేజ్ ఇది..

తెలంగాణ – 9.51%

ఆంధ్రప్రదేశ్ – 9.21%

ఒడిశా – 9.23%

బిహార్ -10.18%

జార్ఖండ్ -11.78%

మధ్యప్రదేశ్ -14.97%

మహారాష్ట్ర – 6.45%

ఉత్తరప్రదేశ్ – 11.67%

పశ్చిమ బెంగాల్ – 15.24%

జమ్మూ కశ్మీర్ – 5.07%

ఈ వార్తలు కూడా చదవండి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest National News and Sports News

Updated Date - May 13 , 2024 | 11:13 AM