Home » Lok Sabha Elections
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో భాగంగా ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీలు యూపీలో ఎక్కువ స్థానాలు గెలవడంపైనే దృష్టిసారించాయి. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేదశ్‌లో ఇప్పటివరకు 53 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. మరో రెండు దశలో 27 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
దేశంలోని అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి రావచ్చనేది అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అంచనా. 2014, 2019 ఎన్నికల్లో యూపీలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ద్వారా ఎన్డీయే కూటమి రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు. ఓటరు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ 14 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
ఏపీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది.. ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు. ఓటరు ఆలోచన ఎలా ఉందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఓటర్లు తమ తీర్పును రిజర్వ్ చేశారు. జూన్4న ఫలితం తేలనుంది. ఈలోపు ఏపార్టీ మెజార్టీ మార్క్ సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
లోక్‌సభ ఎన్నికల(Lok Sabha elections 2024) ఐదో విడత(fifth phase) పోలింగ్ సోమవారం ముగిసింది. ఈ దశలో ఎనిమిది రాష్ట్రాల్లోని 49 స్థానాల్లో 695 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఈ దశలో మొత్తం ఎంత శాతం పోలింగ్ నమోదైంది, గత ఎన్నికలతో పోలిస్తే తగ్గిందా, పెరిగిందా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పని చేయడమే తనకు తెలుసని.. ప్రజాసేవకే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. పదవుల కోసం, గుర్తింపు కోసం ఆలోచించనని.. తాను కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నెల రోజుల క్రితం మొదలై సుదీర్ఘంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో అత్యంత కీలకమైన ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. మొత్తం ఏడు దశలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. అతి తక్కువ స్థానాలకు పోలింగ్ జరిగే దశ ఇదే.
ఒక రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతిచ్చింది. అయితే, కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసరమైన అంశాలనే చర్చించాలని షరతు విధించింది. ముఖ్యంగా రైతు రుణ మాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను భేటీలో చేపట్టకూడదని పేర్కొంది.
ఓ వర్గం ఓట్లు పొందేందుకు పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Benerjee) హిందూ సంఘాలపై దాడి చేస్తోందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారని ప్రధాని మోదీ(PM Modi) ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జార్ఖండ్‌లోని(Jharkhand) జంషెడ్‌పూర్‌లో ఆదివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.