Share News

Lok Sabha Polls 2024: పూర్వాంచల్‌లో పట్టుకోసం పార్టీల ప్రయత్నం.. ప్రజలు ఆదరించేదెవరిని..!

ABN , Publish Date - May 21 , 2024 | 09:21 PM

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో భాగంగా ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీలు యూపీలో ఎక్కువ స్థానాలు గెలవడంపైనే దృష్టిసారించాయి. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేదశ్‌లో ఇప్పటివరకు 53 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. మరో రెండు దశలో 27 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Lok Sabha Polls 2024: పూర్వాంచల్‌లో పట్టుకోసం పార్టీల ప్రయత్నం.. ప్రజలు ఆదరించేదెవరిని..!
Akhilesh Yadav

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో భాగంగా ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీలు యూపీలో ఎక్కువ స్థానాలు గెలవడంపైనే దృష్టిసారించాయి. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేదశ్‌లో ఇప్పటివరకు 53 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. మరో రెండు దశలో 27 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీయే కూటమిలోని బీజేపీ 24 స్థానాల్లో పోటీచేస్తుండగా.. అప్నాదళ్ (ఎస్) రెండు స్థానాల్లో, రాజ్‌భార్‌కు చెందిన ఎస్‌బిఎస్‌ పార్టీ ఒక స్థానంలో పోటీ చేస్తోంది. ఇండియా కూటమిలోని ఎస్పీ 22 స్థానాల్లో, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుండగా.. తృణమూల్ కాంగ్రెస్ ఒక స్థానంలో బరిలో దిగింది. పూర్వాంచల్‌లో OBC, దళిత, అగ్రవర్ణ ఓటర్లు కీలకపాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు సామాజిక వర్గాలవారీ లెక్కలు వేసుకుని మరీ అభ్యర్థులకు సీట్లు కేటాయించాయి.

PM Modi: 'ఇండి' కూటమి పాపాలతో దేశం పురోగమించ లేదు: మోదీ


ఓబీసీలే కీలకం..

పూర్వాంచల్ ప్రాంత రాజకీయాల్లో ఓబీసీలు కీలకపాత్ర పోషిస్తారు. వీరి చుట్టూనే రాజకీయాలు కేంద్రీకృతమై ఉంటాయి. ఓబీసీ ఓటర్లలో 50 శాతం ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంటుందిం. 2017, 2022 అసెంబ్లీ, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు చెందిన ఓటర్లు బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఫలితంగా కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈపరిస్థితుల్లో బిజెపి, SP ఓబీసీ ఓట్లను పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం తన ఉనికిని చాటుకునేందుకు బీఎస్పీ సైతం ర్వాంచల్ రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను రంగంలోకి దించింది.


ఏ పార్టీ ఏ వర్గానికి..

సమాజ్‌వాదీ పార్టీ పోటీచేస్తున్న 22 లోక్‌సభ స్థానాల్లో 14 స్థానాల్లో యాదవేతర ఓబీసీ అభ్యర్థులను , నాలుగు స్థానాల్లో దళిత అభ్యర్థులను పోటీకి దింపింది. అలాగే ఒక స్థానంలో యాదవ్, ముస్లిం, బ్రాహ్మణ, రాజపుత్ర సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పోటీచేస్తున్న నాలుగు స్థానాల్లో దళిత, ఓబీసీ, భూమిహార్, ఠాకూర్‌ సామాజిక వర్గాల నుంచి ఒక్కో అభ్యర్థికి టికెట్ కేటాయించింది. బీఎస్పీ బలహీనపడటాన్ని తమకు అనుకూలంగా మల్చుకోవాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పావులు కదుపుతున్నారు. తుది ఫలితం ఎలా ఉంటుందనేది జూన్4న చూడాల్సి ఉంది.


Lok Sabha elections 2024: ఐదో దశలో తగ్గిన పోలింగ్ శాతం.. 2019తో పోలిస్తే తగ్గిందా, పెరిగిందా?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National News and Telugu News

Updated Date - May 21 , 2024 | 09:29 PM