Home » Lok Sabha Polls 2024
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా ఓటింగ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్లో పెట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 13 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది.
పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి(Mamata Banerjee) వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను తమ్లూక్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్‌కి(Abhijit Gangopadhyay) ఎన్నికల సంఘం(EC) శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది.
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ అనంతరం కూడా వైసీపీ మూకలు కొనసాగించిన ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో ఒక దారుణం వెలుగుచూసింది. ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పిన ఓ కుటుంబంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ మేరకు బాధితులు సుంకర ధనలక్ష్మి, ఆమె కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠ మీడియా వేదికగా తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీతో కూడిన విపక్ష ఇండియా కూటమి గెలిస్తే అయోధ్యలో రామమందిరాన్ని బుల్డోజర్‌లతో కూల్చివేస్తారని ప్రధాని మోదీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తమ్లూక్ బీజేపీ అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంతకు అమ్ముడు పోతున్నారు?’ అని ప్రశ్నించారు. బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్ ఎన్నికల ప్రచారంలో అభిజిత్ గంగోపాధ్యాయ ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభకు ఆరో దశలో జరగనున్న ఎన్నికల్లో 92 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. ఈ దశ ఎన్నికల బరిలో ఉన్న 869 మంది అభ్యర్థుల్లో 866 మంది అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విశ్లేషించింది.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం వ్యక్తిగత వివరణ ఇచ్చారు. సుమారు అరగంట పాటు సీఎస్, డీజీపీ వివరణ ఇచ్చారు. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ప్రభుత్వ కార్యాలయాలు.., ప్రైవేట్ సంస్థలు.., నలుగురు ఎక్కడ కలిసినా ఒకటే చర్చ. అన్నా, ఎన్నికలు ఎలా జరిగాయి..? ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలువబోతున్నారు..? ఏ పార్టీకి ఎన్ని స్థానాలొస్తాయి..? సాధారణ పౌరుల నుంచి ఉన్నతాధికారుల వరకు రాజకీయాలపై ఆసక్తి ఉన్న చాలామంది ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రాయ్ బరేలికి క్యూ కట్టారు. రాహుల్ గాంధీ రాయ్ బరేలి నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. రేపు లేదా ఎల్లుండి రాయ్ బరేలిలో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిసినందున రాయ్ బరేలిలో ప్రచారానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు.