Home » Lok Sabha Polls 2024
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ గురువారం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి సునేత్ర పవార్ బరిలో దిగారు.
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. జూన్ 18వ తేదీన వారణాసిలో జరిగే రైతుల సభలో ఆయన పాల్గొనున్నారు. ఆ క్రమంలో సమ్మాన్ నిధి నుంచి 17వ విడత నిధులను ఆయన విడుదల చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డైలమాలో పడ్డారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా రాహుల్ గాంధీ గెలుపొందారు.
ఎట్టకేలకు లోక్ సభ(Lok Sabha Elections 2024) ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రంలో కొత్త సర్కార్ కొలువుదీరబోతోంది. రాష్ట్రాల్లో ఎంపీలుగా ఎన్నికైన వారే కేంద్రంలో సర్కార్‌ని ఎన్నుకుంటారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 293 సీట్లు రాగా, ఇండియా కూటమికి 232 సీట్లు వచ్చాయి. అయితే ఎంపీల జీతం(MPs Salaries) ఎంతుంటుందోనని ఎప్పుడైనా ఆలోచించారా.
ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.27 గంటలకు కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తాజాగా నరేంద్ర మోదీ కేబినెట్ కొలువు తీరింది. ఈ కేబినెట్‌లో సమాచార, సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా జితిన్ ప్రసాద త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లోని తన మంత్రి పదవికి ఆయన మంగళవారం రాజీనామా చేశారు.
టాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై పంజాబ్ ఎయిర్‌పోర్ట్‌లో మహిళా కానిస్టేబుల్ దాడి చేసింది. ఈ ఘటనపై పంజాబ్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ సింగ్ మాన్ సోమవారం స్పందించారు.
సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రేమ సింగ్ తమాంగ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని గంగ్‌టాక్‌లోని పల్జోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తమాంగ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ ఆచార్య ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన కేబినెట్ సమావేశమైంది. న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి 71 మంది మంత్రులు హాజరయ్యారు.