Share News

Sikkim: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తమాంగ్

ABN , Publish Date - Jun 10 , 2024 | 06:51 PM

సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రేమ సింగ్ తమాంగ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని గంగ్‌టాక్‌లోని పల్జోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తమాంగ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ ఆచార్య ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.

Sikkim: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తమాంగ్

గ్యాంగ్‌టెక్, జూన్ 10: సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రేమ సింగ్ తమాంగ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని గంగ్‌టాక్‌లోని పల్జోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తమాంగ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ ఆచార్య ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. దీంతో తమాంగ్ వరుసగా రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏప్రిల్ 19వ తేదీన 32 స్థానాలున్న సిక్కిం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ప్రేమ సింగ్ తమాంగ్ సారథ్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చ పార్టీ 31 స్థానాలను కైవసం చేసుకుంది.


అయితే ఆ రాష్ట్రాన్ని గత 25 ఏళ్లుగా సిక్కిం డెమోక్రటిక్ ఫ్రెంట్ (ఎస్‌డీఎఫ్) పాలిస్తూ వచ్చింది. కానీ 2019 ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ రాష్ట్ర సీఎంగా ప్రేమ సింగ్ తమాంగ్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సైతం సిక్కిం ఓటర్లు.. తమాంగ్ పార్టీకే పట్టం కట్టారు. దాంతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ప్రముఖులతోపాటు ఉన్నతాధికారులు సైతం హాజరయ్యారు.

Also Read: Modi3.0: మోదీ కేబినెట్.. తెలుగు వారి శాఖలు !

Also Read: Amitabh Bachchan: 40 ఏళ్ల తర్వాత.. ?

Also Read: LokSabha Election Result: రేపు రాయ్‌బరేలీకి రాహుల్, ప్రియాంక..?

Also Read: Modi 3.0: 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 10 , 2024 | 06:53 PM