Home » Lok Sabha Polls 2024
వరుసగా మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. కాంగ్రెసేతర పక్షాల నుంచి ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న తొలి వ్యక్తి మోదీనే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో తొలిసారి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఫలితాల తర్వాత నెహ్రూ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957, 62 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రె్‌సను ఆయన విజయపథాన నడిపించి ప్రధాని అయ్యారు. నెహ్రూ కుమార్తె ఇందిరకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.
ఓవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంటే.. మరోవైపు ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి..
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. జూన్ 9వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు న్యూఢిల్లీలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ.. ఆసియాలో తొలి మహిళ లోకో పైలెట్ సురేఖ యాదవ్‌ను ఆహ్వానం అందింది.
ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లో కమలం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి గల కారణాలను పార్టీ అన్వేషిస్తుంది. ఆ క్రమంలో ‘ఆప్’ ఓటమికి కారణాల్లో మాజీ ఎమ్మెల్యే నితీన్ త్యాగి ఒకరని ఆ పార్టీ గుర్తించింది.
ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. అనంతరం మోదీ.. బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్ కె అద్వానీ నివాసానికి వెళ్లారు. ఆయన వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి నివాసానికి మోదీ వెళ్లారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకు కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 99 స్థానాలకు గెలుచుకుంది. అయితే మహారాష్ట్ర సింగ్లి లోక్‌సభ సభ్యుడు విశాల్ పాటిల్.. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు నరేంద్ర మోదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోదీ కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోదీని ముర్ము కోరారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధిస్తుందని.. తమ బీజేపీనే 370 సీట్లను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ..
లోక్‌సభ ఎన్నికలు-2024లో ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్‌ను (272) మించి 293 స్థానాలను కైవసం చేసుకోవడంతో.. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే..
లోక్ సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ(BJP) అనుకున్న మేర ఫలితాలు రాబట్టలేకపోయింది. కొన్ని రాష్ట్రాల్లో 30కిపైగా స్థానాల్లో కొత్తగా ఎంపీ సీట్లను గెలవగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.