Share News

Delhi: ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సురేఖ

ABN , Publish Date - Jun 07 , 2024 | 08:12 PM

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. జూన్ 9వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు న్యూఢిల్లీలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ.. ఆసియాలో తొలి మహిళ లోకో పైలెట్‌ సురేఖ యాదవ్‌ను ఆహ్వానం అందింది.

Delhi: ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సురేఖ
Surekha Yadav

న్యూఢిల్లీ, జూన్ 07: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. జూన్ 9వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు న్యూఢిల్లీలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ.. ఆసియాలో తొలి మహిళ లోకో పైలెట్‌ సురేఖ యాదవ్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు మధ్య రైల్వే (Central Railway) శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి షోలాపుర్ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆమె లోకో పైలెట్‌గా వ్యవహరిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తొలి మహిళా లోకో పైలెట్‌‌ కూడా సురేఖనే కావడం గమనార్హం.

Also Read: Nara Lokesh: టీడీపీ ఎప్పుడు ‘ఆ పని’ చేయదు..


మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతం సతారాకు చెందిన సురేఖ యాదవ్..1988లో రైల్వేలో డ్రైవర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆమె వృత్తి పట్ల నిబద్దతతో పని చేయడంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు అవార్డులను సొంత చేసుకున్నారు. భారత్‌ తొలి మహిళ ట్రైన్ డ్రైవర్ కూడా సురేఖా యాదవ్ అన్న సంగతి తెలిసిందే. ఇక మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం 10 మంది లోకో పైలెట్లను ఆహ్వానించారు. వారిలో సురేఖ ఒకరు.

Also Read: మోదీ ఆరోపణలు.. కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం

Also Read: అద్వానీ, జోషిల నుంచి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

Also Read: నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి

Also Read: బాలీవుడ్ మౌనంపై కంగనా రనౌత్ స్పందన

Also Read: Breaking: ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము

For Latest News and National News click here

Updated Date - Jun 07 , 2024 | 08:14 PM