NDA Key Meeting: అద్వానీ, జోషిల నుంచి ఆశీర్వాదం తీసుకున్న మోదీ
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:24 PM
ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. అనంతరం మోదీ.. బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్ కె అద్వానీ నివాసానికి వెళ్లారు. ఆయన వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి నివాసానికి మోదీ వెళ్లారు.
న్యూఢిల్లీ, జూన్ 07: ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. అనంతరం మోదీ.. బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్ కె అద్వానీ నివాసానికి వెళ్లారు. ఆయన వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి నివాసానికి మోదీ వెళ్లారు. అక్కడ ఆయన నుంచి ఆశీర్వాదాన్ని అందుకున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 240 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి రామ్ విలాస్ పాశ్వాన్, శివసేన షిండే మద్దతుతో మోదీ ప్రభుత్వాన్ని రెండు మూడు రోజుల్లో కొలువు తీరనుంది. మరోవైపు జూన్ 9వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇక శుక్రవారం పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మోదీకి ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కీలక సమావేశం అనంతరం నరేంద్ర మోదీ.. పార్టీలోని ఈ సీనియర్ నేతల నివాసాలకు వెళ్లి.. వారి ఆశీర్వాదం అందుకున్నారు.
Also Read: Nara Lokesh: టీడీపీ ఎప్పుడు ‘ఆ పని’ చేయదు..
Also Read: మోదీ ఆరోపణలు.. కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం
Also Read: అద్వానీ, జోషిల నుంచి ఆశీర్వాదం తీసుకున్న మోదీ
Also Read: నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి
Also Read: బాలీవుడ్ మౌనంపై కంగనా రనౌత్ స్పందన
For Latest News and National News click here