Home » Lok Sabha Polls 2024
లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి బోటా బోటి మెజార్టీతో అధికారం చేపట్టబోతుంది. భారతీయ జనతా పార్టీ కేవలం 240 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. విపక్ష కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలపడుతోంది. గత ఎన్నికలతో పోల్చితే సీట్ల సంఖ్య పెరిగింది.
ఎన్డీఏ సర్కారు మరోసారి కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టబోతోంది. దీంతో నరేంద్ర మోదీ(PM Modi Oath Taking Ceremony) మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో లోక్ సభ ఎన్నికలు విజయవంతంగా పూర్తికావడంపై అగ్రరాజ్యం అమెరికా(America) స్పందించింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి ప్రశంసించింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అభినందనలు తెలిపింది.
లోక్ సభ ఎన్నికల సమరం ముగిసింది. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. మెజారిటీ 272 సీట్లుకాగా ఎన్డీఏ కూటమి ఇప్పటికే 293 సీట్లల్లో గెలుపొందింది. అయితే ఎన్డీఏ అభ్యర్థుల్లో చాలా మంది అత్తెసరు మెజారిటీతో ఓడిపోగా, మరి కొందరు భారీ మెజారిటీతో ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవి చూశారు.
నాగాలాండ్‌లోని ఏకైక లోక్‌సభ స్థానంలో విజయం సాధించి కాంగ్రెస్ రికార్డు సృష్టించింది. ఇక్కడ 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్లీ ఖాతా తెరిచింది. ఆ పార్టీకి నాగాలాండ్ అసెంబ్లీలో సైతం గత ఇరవయ్యేళ్లుగా ప్రాతినిధ్యం లేదు.
‘యూ-టర్న్ రారాజు’గా పేరొందిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి యూ-టర్న్ తీసుకోబోతున్నారా? సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇండియా కూటమిని వీడి ఎన్డీఏలో చేరిన ఆయన..
Prime Minister Of India: దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలూ వచ్చేశాయి.. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఓటర్లు. ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వకపోవడంతో.. మళ్లీ సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో అసలు చర్చ ఇప్పుడే ప్రారంభమైంది. ఇంతకాలం మోదీ 3.0 సర్కార్ వస్తుందని అంతా అనుకున్నా.. సీన్ రివర్స్ అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ఎగబడి ఎగబడి.. మోదీ నామం జపించినా..
పవన్ కళ్యాణ్.. నిన్నటి వరకు నిలకడ లేని మనిషి.. సరైన ఆలోచన లేని నాయకుడు.. రాజకీయాల్లో రాణించలేడంటూ మాటలు పడ్డ వ్యక్తి.. అది గతం.. ప్రస్తుతం సీన్ మారింది. నేడు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రియల్ హీరో.
కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అన్నారు. అదొక చచ్చిన పాములాంటిదని హేళన చేశారు. ఆ పార్టీ ఇంకెప్పుడూ కేంద్రంలో అధికారంలోకి రాదని.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వ్యంగ్యాస్త్రాలు...
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి అదరగొట్టింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎనిమిది జిల్లాల్లో 110 సీట్లు ఉండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 110 సీట్లలో విజయం సాధించింది.