Lok Sabha Polls 2024: ఉద్దండులకూ తప్పని ఓటమి.. బీజేపీ అభ్యర్థులే అధికం
ABN , Publish Date - Jun 05 , 2024 | 09:14 AM
లోక్ సభ ఎన్నికల సమరం ముగిసింది. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. మెజారిటీ 272 సీట్లుకాగా ఎన్డీఏ కూటమి ఇప్పటికే 293 సీట్లల్లో గెలుపొందింది. అయితే ఎన్డీఏ అభ్యర్థుల్లో చాలా మంది అత్తెసరు మెజారిటీతో ఓడిపోగా, మరి కొందరు భారీ మెజారిటీతో ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవి చూశారు.

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల సమరం ముగిసింది. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. మెజారిటీ 272 సీట్లుకాగా ఎన్డీఏ కూటమి ఇప్పటికే 293 సీట్లల్లో గెలుపొందింది. అయితే ఎన్డీఏ అభ్యర్థుల్లో చాలా మంది అత్తెసరు మెజారిటీతో ఓడిపోగా, మరి కొందరు భారీ మెజారిటీతో ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవి చూశారు.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత కిషోరీ లాల్ శర్మ చేతిలో 1.5 లక్షల ఓట్ల తేడాతో ఘోర పరాజయం చవి చూశారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం శర్మకు 5,39,228 ఓట్లు రాగా, ఇరానీకి 3,72,032 ఓట్లు వచ్చాయి.
అధీర్ రంజన్ చౌదరి యూసుఫ్ పఠాన్ చేతిలో..
పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ స్థానంలో, తృణమూల్ కాంగ్రెస్ (TMC) టిక్కెట్‌పై మొదటిసారి పోటీ చేసిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, బహరంపూర్ బురుజులో సీనియర్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరిని ఓడించారు.
ఖేరీలో అజయ్ కుమార్..
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ నుంచి కేంద్ర మంత్రి అజయ్ కుమార్ తేని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఉత్కర్ష్ వర్మ మధుర్‌పై 34,329 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
రాజీవ్ చంద్రశేఖర్..
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓటమి పాలయ్యారు. థరూర్ 16 వేల మెజారిటీతో గెలుపొందారు.
మేనకా గాంధీ..
సుల్తాన్‌పూర్ నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీపై ఎస్పీ అభ్యర్థి రాంభూల్ నిషాద్‌పై 43,174 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
ఒమర్ అబ్దుల్లా..
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి షేక్ అబ్దుల్ రషీద్ చేతిలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఓడిపోయారు.
అన్నామలై..
దక్షిణాదిపై పట్టు నిలుపుకుందామనుకున్న బీజేపీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కుప్పుసామి కోయంబత్తూరులో డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్‌కుమార్‌పై 1,18,068 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
For Latest News and National News Click Here