USA: భారత్‌లో ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసలు.. గెలుపోటములపై మాట్లాడబోమని వ్యాఖ్య
ABN , Publish Date - Jun 05 , 2024 | 11:32 AM
అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో లోక్ సభ ఎన్నికలు విజయవంతంగా పూర్తికావడంపై అగ్రరాజ్యం అమెరికా(America) స్పందించింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి ప్రశంసించింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అభినందనలు తెలిపింది.
న్యూయార్క్: అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో లోక్ సభ ఎన్నికలు విజయవంతంగా పూర్తికావడంపై అగ్రరాజ్యం అమెరికా(America) స్పందించింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి ప్రశంసించింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అభినందనలు తెలిపింది. ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు..? అన్న దానిపై కామెంట్స్ చేయబోమని, ఎవరు గెలిచినా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
‘అతి పెద్ద ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వాన్ని, అందులో పాల్గొన్న ఓటర్లను అభినందిస్తున్నాం. గెలుపోటములపై మాట్లాడబోం. అది మా విధానం. ఎవరు గెలిచినా ఇండియాతో సత్సంబంధాలు కొనసాగుతాయి’ అని యూఎస్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ పేర్కొన్నారు.
భారత ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయనే ఆరోపణలను ఆయన ఖండించారు. అలాంటి ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. వివిధ దేశాల్లో జరిగే పరిణామాలపై తాము సందర్భానుసారంగా స్పందిస్తామని, అంతమాత్రాన జోక్యం చేసుకోవడం కాదని మాథ్యూ స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. మెజారిటీ 272 సీట్లుకాగా ఎన్డీఏ కూటమి ఇప్పటికే 293 సీట్లల్లో గెలుపొందింది.
For Latest News and National News Click Here