Home » Lok Sabha Results
కాంగ్రెస్.. పడి లేచింది. దేశ రాజకీయ రంగస్థలం నిజంగానే కాంగ్రెస్ ముక్త్ కాబోతోందా అనే పరిస్థితి నుంచి కోలుకొని ఉనికిని మరోసారి బలంగా చాటుకుంది. ఈ మార్పు వెనక ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కృషి కీలకం. వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో (2014, 2019) కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాలు చవి చూసింది.
కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో కమలం పార్టీ 17 స్థానాలు కైవసం చేసుకోగా.. మిత్రపక్షం జేడీఎ్‌సకు 2 దక్కాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 9 స్థానాలకు పరిమితమైంది.
రాజ్యాంగంపై మోదీ, అమిత్ షా దాడిని ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ, అమిత్ షాను వద్దని దేశం స్పష్టం చేసిందని, పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నేతల తీరుపై సంతృప్తిగా లేమని ప్రజలు తెల్చేశారని పేర్కొన్నారు. అలాగే, మోదీ, అదానీ ఒకటే అని ప్రజలకు అర్థమైపోయిందని..
సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరపడింది! పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓటర్లు ఎన్డీయేకు పట్టం కట్టారు! ఇది ‘మోదీ గ్యారెంటీ’ అని పదే పదే హామీ ఇచ్చినా.. బీజేపీని మాత్రం మేజిక్ మార్కును దాటనివ్వలేదు! ఫలితంగా.. ఈసారి కేంద్రంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకానుంది! సంపూర్ణ ఆధిపత్యం పోయి..
ఒడిసా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. 24 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని ఏలిన నవీన్ పట్నాయక్‌కు ప్రజలు షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసి, దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలనుకున్న ఆయనకు నిరాశే మిగిలింది.
‘యూ-టర్న్ రారాజు’గా పేరొందిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి యూ-టర్న్ తీసుకోబోతున్నారా? సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇండియా కూటమిని వీడి ఎన్డీఏలో చేరిన ఆయన..
Prime Minister Of India: దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలూ వచ్చేశాయి.. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఓటర్లు. ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వకపోవడంతో.. మళ్లీ సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో అసలు చర్చ ఇప్పుడే ప్రారంభమైంది. ఇంతకాలం మోదీ 3.0 సర్కార్ వస్తుందని అంతా అనుకున్నా.. సీన్ రివర్స్ అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ఎగబడి ఎగబడి.. మోదీ నామం జపించినా..
పవన్ కళ్యాణ్.. నిన్నటి వరకు నిలకడ లేని మనిషి.. సరైన ఆలోచన లేని నాయకుడు.. రాజకీయాల్లో రాణించలేడంటూ మాటలు పడ్డ వ్యక్తి.. అది గతం.. ప్రస్తుతం సీన్ మారింది. నేడు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రియల్ హీరో.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తొలిసారి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రజలు చాలా స్పష్టంగా తీర్పునిచ్చారని అన్నారు. ''ఇది ఆయన నైతిక, రాజకీయ ఓటమి'' అని అభివర్ణించారు. రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్‌తో కలిసి మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP), ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు చక్రం తిప్పి, గత ఎన్నికల్లోనూ గట్టి ఉనికిని చాటుకున్న మాయావతి సారధ్యంలోని బీఎస్‌పీకి 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.