Lok Sabha Result: ఢిల్లీలో 'ఆప్', యూపీలో బీఎస్‌పీ ఖాళీ..
ABN , Publish Date - Jun 04 , 2024 | 07:23 PM
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP), ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు చక్రం తిప్పి, గత ఎన్నికల్లోనూ గట్టి ఉనికిని చాటుకున్న మాయావతి సారధ్యంలోని బీఎస్‌పీకి 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP), ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు చక్రం తిప్పి, గత ఎన్నికల్లోనూ గట్టి ఉనికిని చాటుకున్న మాయావతి సారథ్యంలోని బీఎస్‌పీ (BSP)కి 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
'ఆప్' హిస్టరీ రిపీట్..
2019 ఎన్నికల్లో ఒక్క పార్లమెంటు స్థానం కూడా గెలుచుకోని 'ఆమ్ ఆద్మీ పార్టీ' ఈసారి (2024) కూడా ఎన్నికల్లోనూ ఖాతా తెరవకుండానే చతికిలపడింది. బీజేపీ మరోసారి ఢిల్లీలోని 7 లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసింది. కొద్దిలో కొద్దిగా ఊరట అన్నట్టుగా 'ఆప్' పంజాబ్‌లో ఒక సీటు గెలుచుకుంది.
యూపీలో బీఎస్‌పీ ఉనికి కోల్పోయినట్టేనా?
ఉత్తరప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా, దళిత పవర్‌హౌస్‌గా పేరున్న మాయావతి పార్టీ బీఎస్‌పీ ఈసారి ఖాతా తెరవకుండానే చతికిలపడింది. బీఎస్‌పీ మొత్తం 80 సీట్లలో పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం ఆ పార్టీని విస్తుపోయేలా చేసింది. 68 ఏళ్ల మాయావతి 1995, 1997, 2002, 2007లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎంపీగా కూడా సేవలందించారు.