Home » Lok Sabha Results
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ కాంగ్రెస్, ఆ పార్టీ సారథ్యంలోని 'ఇండియా' కూటమిలో జోష్ పెరుగుతోంది. కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు చోట్లా భారీ అధిక్యత దిశగా దూసుకుపోతున్నారు.
లోక్సభ ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. అయితే.. ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వడానికి ముందే ఒక స్థానంలో బీజేపీ గెలుపొందింది. అవును..
లైంగిక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రస్తుతం 'సిట్' రిమాండ్‌లో ఉన్న జేడీఎస్ నేత హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సొంత నియోజకవర్గంలోనే ఎదురీతుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
''400 సీట్లకు పైనే'' అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మెజారిటీకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్ మధ్యాహ్నం 12 గంటల వరకూ వెలువరించిన ట్రెండ్స్ ప్రకారం ఎన్డీయే కూటమి 295 సీట్లలో ఆధిక్యంలో ఉంది.ఎగ్జిట్ ఫలితాలను తలకిందులు చేస్తూ 'ఇండియా' కూటమి 230 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
లోక్ సభ ఎన్నికల్లో విశాఖ పట్నం నుంచి, అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన కుండ గుర్తుపై పోటీ చేసిన కేఏ పాల్‌కి(KA Paul) షాక్ తగిలింది.
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో 'ఇండియా' కూటమి అనూహ్యమైన ఫలితాల దిశగా దూసుకు వెళ్తోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కంటే 'ఇండియా' బ్లాక్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఉత్తరప్రదేశ్ లోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కీలకమైన అమేథీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ తొలి ట్రెండ్స్ ప్రకారం స్మృతి ఇరానీ 34,887 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థులు పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, నెల్లూరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎవరికి అంతుపట్టడంలేదు. తుది ఫలితం కోసం చివరి రౌండ్ వరకు వేచిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా 70 వరకు బీజేపీకి వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనావేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి 30కి పైగా సీట్లలో అధిక్యాన్ని కనబరుస్తోంది.
ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లతో పాటు మరోవైపు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు వైసీపీ నేతలు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.