Lok Sabha polls results: ప్రజ్వల్ రేవణ్ణ ఎదురీత..
ABN , Publish Date - Jun 04 , 2024 | 01:19 PM
లైంగిక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రస్తుతం 'సిట్' రిమాండ్లో ఉన్న జేడీఎస్ నేత హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సొంత నియోజకవర్గంలోనే ఎదురీతుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
బెంగళూరు: లైంగిక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రస్తుతం 'సిట్' రిమాండ్లో ఉన్న జేడీఎస్ (JDS)నేత హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సొంత నియోజకవర్గంలోనే ఎదురీతుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హసన్ నియోజకవర్గం నుంచి తిరిగి పోటీలో ఉన్న ప్రజ్వల్ మధ్యాహ్నం 12.30 గంటల వరకూ వెలువడిన ట్రెండ్స్ ప్రకారం తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి శ్రేయాస్ పటేల్ కంటే వెనుకబడ్డారు. 13,500 ఓట్ల వెనుకంజలో ప్రజ్వల్ ఉండటంతో హసన్ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 1.4 లక్షల మెజారిటీతో హసన్ నుంచి ప్రజ్వల్ గెలుపొందారు. ఈసారి కర్ణాటకలో బీజేపీతో పొత్తుతో జేడీయూ కర్ణాటకలో పోటీ చేసింది.
Read Latest International News and Telugu News