Home » M.K Stalin
బీజేపీ సర్కారు మరోసారి అధికారంలోకి రాకుండా ఉండేందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముంబైలోని ఇండియా కూటమి సమావేశానికి వెళ్లే ముందు స్పీకింగ్ ఫర్ ఇండియా పాడ్‌కాస్ట్ వీడియోను తమిళనాడు సీఎం స్టాలిన్ విడుదల చేశారు.
ప్రపంచకప్ చెస్ టోర్నీని ముగించుకుని స్వదేశానికి వచ్చిన ప్రజ్ఞానందకు చెన్నై విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రజ్ఞానంద నేరుగా తన కుటుంబసభ్యులతో కలిసి తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లాడు. తమిళనాడుతో పాటు యావత్ దేశం గర్వించేలా గొప్ప ప్రదర్శన చేసినందుకు సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా ప్రోత్సాహకంగా రూ.30 లక్షల చెక్కు అందించి మెమెంటోను బహూకరించారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. ఈ డిమాండ్‌తో ఆయన కుమారుడు, ఉదయనిధి నేతృత్వంలో రాష్టవ్యాప్తంగా నిరాహార దీక్షలు జరిగాయి.
నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్తాపంతో 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక అతని తండ్రి కూడా మరుసటి రోజే ఆత్మహత్య చేసుకున్నాడు.
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన కొన్ని బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం పట్ల డీఎంకే అభ్యంతరం తెలిపింది. బ్రిటిష్ కాలంనాటి మూడు చట్టాలను సంస్కరించేందుకు భారతీయ పేర్లతో ఈ బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు.
తమిళం, హిందీ భాషల వివాదం మళ్లీ మొదలైంది. ఎలాంటి వ్యతిరేకత లేకుండా చివరాఖరికి హిందీని స్వీకరించవలసిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ (MK Stallin) తప్పుబట్టారు. హిందీ పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకతను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమిళనాడులో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో అధికార డీఎంకే కీలక నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి, ఆయన కుమారుడు ఎంపీ గౌతం సిగమణి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. చెన్నై, విల్లుపురంలోని తండ్రికొడుకుల ఇళ్ల వద్ద ఈడీ దాడులు జరుగుతున్నాయి.
తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం మరింత ముదురుపాకాన పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవి అడుగడుగునా అడ్డుపడుతూ అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi), అధికార పార్టీ డీఎంకే మధ్య మరో వివాదం తలెత్తింది. మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన సెంథిల్ బాలాజీ నిర్వహించిన మంత్రిత్వ శాఖలను వేరొకరికి కేటాయించడానికి సంబంధించిన ఫైలును రవి తిప్పి పంపడంతో డీఎంకే నేతలు రగిలిపోతున్నారు. బీజేపీకి ఏజెంట్‌గా వ్యవహరించవద్దని రవికి సలహా ఇస్తున్నారు.
మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీపై తెల్లవారుజామున 2 గంటల వరకూ కూడా ఒత్తిడి తీసుకువచ్చి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. ఇది అమానవీయమైన చర్య అని అన్నారు. చెన్నైలోని ఓముందురార్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న సెంథిల్ కుమార్‌ను స్టాలిన్ పరామర్శించారు.