Home » Macherla
పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా...
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎం, వీవీప్యాట్‌లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఆ తర్వాత వారిని టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు అడ్డుకున్నారు. ఆయనకు పిన్నెల్లి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని..
మాచర్ల ఎమ్మెల్యే పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీఈవో, డీజీపీకి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) బూత్‌లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ (AP Election 2024) రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఆలస్యంగా వెలుగుచూస్తున్నాయి. టీడీపీ శ్రేణులపై దాడులతో పాటు ఓటమి భయంతో పిన్నెల్లి సోదరులు బూత్‌లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన కలకలం రేపింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ (మే -13), ఆ తర్వాత రోజు నుంచి పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) ఆయన సోదరులు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి సామాన్యులపై వరుసగా దాడులకు పాల్పడుతునే ఉన్నారు.
ఏపీలో ఐదేళ్లలో వైసీపీ (YSRCP) నేతలు పెట్రేగిపోయారు. వారు సృష్టించిన అరాచకం, దాడులు అన్ని ఇన్ని కావు. సామాన్యులపై దాడులు చేస్తూ ఈ ఐదేళ్లలో ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురిచేశారు.
Andhrapradesh: పల్నాడు హింసపై నిజాల్ని సమాధి చేసే కుట్ర జరుగుతోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నిజనిర్దారణ కమిటీని మాచర్ల ఎందుకు వెళ్లనివ్వలేదని ప్రశ్నించారు. పల్నాడు హింసకు కారణాల్లో పోలీసుల తీరుపైనే ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. డీజీపీ, ఎస్పీలు మారినా కిందిస్థాయి ఖాకీల్లో వైసీపీ వీరవిధేయులు ఉన్నారన్నారు.
Andhrapradesh: పోలింగ్ సమయంలో మాచర్లలో ఎలాంటి ఘటనలకు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల వద్దకు రానీయకుండా వైసీపీ నేతలు అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయితే మాచర్ల అల్లర్ల విషయంలో షాకింగ్ విషయం బయటపడింది. మాచర్ల అల్లర్లకు పలువురు పోలీసులే సహకరిస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు... మాచర్ల అల్లర్లకు సహకరిస్తున్న పలువురు పోలీసు సిబ్బందిని గుర్తించారు.