Pinnelli Ramakrishna Reddy:ఈసీ సీరియస్... పిన్నెల్లి బ్రదర్స్ పరార్..!
ABN , Publish Date - May 17 , 2024 | 04:31 PM
ఏపీలో ఐదేళ్లలో వైసీపీ (YSRCP) నేతలు పెట్రేగిపోయారు. వారు సృష్టించిన అరాచకం, దాడులు అన్ని ఇన్ని కావు. సామాన్యులపై దాడులు చేస్తూ ఈ ఐదేళ్లలో ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురిచేశారు.
పల్నాడు జిల్లా: ఏపీలో ఐదేళ్లలో వైసీపీ (YSRCP) నేతలు పెట్రేగిపోయారు. వారు సృష్టించిన అరాచకం, దాడులు అన్ని ఇన్ని కావు. సామాన్యులపై దాడులు చేస్తూ ఈ ఐదేళ్లలో ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురిచేశారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Ramakrishnareddy Pinnelli), ఆయన సోదరులు ఎన్నో దాడులకు పాల్పడ్డారు.
వారి అవినీతిని, అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. వీళ్ల దాడిలో పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరికి ఇది కూడా చాలదన్నట్లు పలువురు టీడీపీ సానూభూతిపరులను గ్రామాలకు గ్రామాలు వదలి వెళ్లేలా భయాందోళనలకు గురిచేశారు. సామాన్య ప్రజలు, టీడీపీ సానూభూతిపరులపై దాడులు చేసి ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురిచేశారు.
Elections 2024: వైసీపీ గూండాలకు రోజులు దగ్గరపడ్డాయి: విష్టుకుమార్ రాజు
పోలింగ్ రోజున హింస
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగిన తర్వాత కూడా వీరిలో ఏమాత్రం మార్పు రాలేదు. అంతకంతకూ పెట్రేగిపోయారు. పోలింగ్ రోజున మొదలైన వీరి అరాచకం మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బంధువు మంజుల టీడీపీలో చేరిన దగ్గరి నుంచి ఆమెపై ప్రతీకారంతో రగిలిపోయారు.
సరిగ్గా పోలింగ్ రోజున హింసకాండకు పాల్పడ్డారు. మంజుల పోలింగ్ బూత్‌లో టీడీపీ ఏజెంట్‌గా కూర్చొని ఉండగా... ఈ విషయం నచ్చని పిన్నెల్లి అనుచరగణం ఒక్కసారిగా గొడ్డళ్లు, కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా నుదిటిపై గొడ్డలితో నరికారు. ఆమె వీరనారిలా పిన్నెల్లి అనుచరగణంపై పోరాడింది. ఈ ఘటన తర్వాత పలు ఈవీఎంలు ఉన్నస్ట్రాంగ్ రూంల వద్ద పలు అవకతవకలకు పాల్పడ్డారు. వీరి అక్రమాలపై ఎదురు తిరిగిన టీడీపీ నేతలపై రాళ్లు, కత్తులు, గొడ్డళ్లతో హింసకు పాల్పడ్డారు.
ఆ ఘటనపై ఈసీ సీరియస్...
మాచర్ల, కారంపూడిలో పిన్నెల్లి సోదరులు, వారి అనుచరులు టీడీపీ నేతలపై ఏకపక్షంగా దాడులకు తెగబడ్డారు. కారంపూడి మండలం పేటసన్నెగండ్ల పంచాయతీ పోతురాజులగుట్టలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వీరు దగ్ధం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను అడ్డుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలపై మారణాయుధాలతో దాడులు చేసి భయాందోళనలకు గురిచేశారు. స్థానిక గ్రామాల్లో తిరుగుతూ పిన్నెల్లి సోదరులు వీరంగం సృష్టించారు. వీరి అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) సీరియస్ అయింది.
వీరి అల్లర్లు, హింస కాండపై ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ రంగంలోకి దిగడంతో మాచెర్ల ఎమ్మెల్యే సోదరులు పారిపోయినట్లు తెలుస్తోంది. గన్‌మెన్లను వదిలేసి పిన్నెల్లి సోదరులు పరారయ్యారు. గత రాత్రి నుంచి వీరు కనిపించటం లేదు.. 144 సెక్షన్ నేపథ్యంలో హౌస్ అరెస్ట్‌లో వారు ఉన్నట్లు సమాచారం. పల్నాడు కలెక్టర్, ఎస్పీ, పలువురు పోలీసుల సస్పెన్షన్‌తో ఎన్నికల కమిషన్ చర్యల్లో స్పీడ్ పెంచింది. దీంతో వీరిలో కంగారు మొదలైనట్లు తెలుస్తోంది. కారంపూడి ఘటనలో తమను అరెస్టు చేస్తారని పిన్నెల్లి సోదరులు భయపడిపోయి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ చర్యలతో పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో పిన్నెల్లి సోదరులు పారిపోయి ఉండవచ్చని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Raghurama: కూటమికి 125 సీట్లు పక్కా: రఘురామకృష్ణంరాజు
AP Elections: జగన్‌కు దెబ్బ.. చెల్లెళ్లకు ఊరట
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News