Home » Madhavi Latha
తెలంగాణలో ఒకవైపు ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరిట వసూళ్లు జరుగుతుండగా.. హైదరాబాద్‌లో మరో ఆర్(రజాకార్) ట్యాక్స్ కూడా వసూలవుతోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై చర్చ బాగా జరుగుతోంది. ఒక ఆర్.. తెలంగాణాకు సంబంధించినది కాగా, మరో ఆర్.. ఢిల్లీది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన పార్టీ అధినేత ఏక్‌నాథ్ షిండే పిలుపు మేరకు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్ధి మాధవీలత(Madhavilatha)కు సంపూర్ణ మద్దతు శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రకటించింది.
పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉండాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌శర్మ(Rajasthan Chief Minister Bhajanlal Sharma) ప్రజలను కోరారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. హిందూ ధర్మం, మోదీపై అద్దంకి దయాకర్ అభ్యంతర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సీఈఓ వికాస్ రాజ్‌ను సోమవారం బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత (Madhavi latha) కలిసి ఫిర్యాదు చేశారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత కీలకమైనవో ఓటు హక్కు వినియోగం కూడా అంతే ముఖ్యమైనది. అందుకే ఎన్నికల సంఘం మొదలుకుని, సమాజంలోని వివిధ రంగాల ప్రముఖుల వరకు ‘ఓటు వేయాలంటూ’ ప్రజలకు పిలుపునిస్తుంటారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) పై తెలంగాణలోని(Telangana) మొఘల్ పురా పోలీస్ స్టేషన్‌లో(Moghalpura Police Station) కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అసలు అమిత్ షా పై ఎందుకు కేసు నమోదు చేశారో చూద్దాం..
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత(BJP candidate Madhavilatha) కొంపెల్ల స్ట్రాంగ్ వుమెన్ అని నటి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renudesai) తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పేర్కొంది.
బీజేపీ (BJP) దెబ్బకు పాత బస్తీలో బద్ధ శత్రువులు ఏకమయ్యారా!? ఇక్కడ ఎంఐఎంకు ఎంబీటీ పరోక్ష మద్దతు ఇస్తోందా!? మజ్లిస్‌కు (AIMIM)సహకరించడానికే పోటీ నుంచి తప్పుకుందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి తాజా పరిణామాలు..
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పోలింగ్‌కు మరో 17రోజుల సమయం మాత్రమే ఉంది. ఎక్కువ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 17లోక్‌సభ స్థానాలు ఉన్నప్పటికీ.. అందరి గురి కేవలం 16 స్థానాలే.. ఈ నియోజకవర్గాల్లోనే గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు పోటీపడుతుంటారు. మరో నియోజకవర్గం గురించి అసలు ప్రస్తావనే ఉండదు.. ఎందుకంటే ఎన్నికలకు ముందే అక్కడి ఫలితం ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. అదే హైదరాబాద్ నియోజకవర్గం. ఓవైసీ కుటుంబానికి 35 ఏళ్ల నుంచి ఈ నియోజకవర్గం అడ్డాగా మారింది.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత(BJP candidate Kompella Madhavilatha) బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Rajasingh) ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.