Lok Sabha Elections 2024:ఆయన పసిపిల్లలను కూడా వదలట్లేదు.. మాధవీలత మాస్ వార్నింగ్
ABN , Publish Date - May 06 , 2024 | 09:45 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. హిందూ ధర్మం, మోదీపై అద్దంకి దయాకర్ అభ్యంతర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సీఈఓ వికాస్ రాజ్‌ను సోమవారం బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత (Madhavi latha) కలిసి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. హిందూ ధర్మం, మోదీపై అద్దంకి దయాకర్ చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సీఈఓ వికాస్ రాజ్‌ను సోమవారం బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత (Madhavi latha) కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్, మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీపై ఫిర్యాదు చేశారు.
Lok Sabha Polls:మూడో విడతలో ప్రముఖులు.. అమిత్ షా గట్టెక్కుతారా..!
ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ... బీఆర్ఎస్ హైదరాబాద్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని చెప్పారు. అసదుద్దీన్ ఒవైసీ మోదీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అసదుద్దీన్ ఒవైసీ కేవలం ఓట్ల కోసం నోటికి వచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇస్లామిక్ దేశాల్లో దాడులు చేయడమే మన లక్ష్యం అన్నట్లుగా కొందరు ఇస్లామిక్ వాదులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
తప్పుడు ప్రచారం చేస్తున్న ముస్లిం వాదులకు మద్దతిచ్చే విధంగా ఒవైసీ వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అసదుద్దీన్ ఒవైసీ పసిపిల్లలను సైతం వదిలిపెట్టకుండా ఓట్ల రాజకీయం ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఒవైసీ ఎన్నికల్లో నెగ్గడానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మాధవీలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: రైతులకు గుడ్ న్యూస్.. వారి అకౌంట్లలో నిధులు..
Read Latest Telangana News And Telugu News