Home » Maharashtra
పార్టీ గుర్తు గడియారంతో తమకు ఎంతో అనుబంధం ఉందని, ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత, స్పష్టత కోసం, ఓటర్లలో అయోమయం నెలకొనకుండా అజిత్ వర్గం కొత్త గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని శరద్ పవార్ కోరారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అధికార 'మహాయుతి కూటమి' నేతల మధ్య భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. తాజాగా మహా కూటమి భాగస్వామి అయిన ఎన్సీపీ-ఎపీ చీఫ్ అజిత్ పవార్ తమ వాటా సీట్లలో 10 శాతం టిక్కెట్లు మైనారిటీలకు కేటాయిస్తామని ప్రకటిస్తారు.
గాంధీ జయంతి సందర్భంగా నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారంనాడు నిర్వహించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో గడ్కరి పాల్గొన్నారు.
బీజేపీ కీలక నేతల సమావేశంలో పార్టీ ఎన్నికల సన్నద్ధత, గెలుపు సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్షా దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్రలో మహాకూటమి గెలిచిన తర్వాత ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామన్నారు.
దేశ ఆధ్మాత్మిక, శాస్త్రీయ, మిలటరీ చరిత్రను తీసుకున్నప్పటికీ గోమాతకు కీలక పాత్ర ఉందని, పురాతన కాలం నుండి గోవును పూజిస్తున్నామని మహారాష్ట్ర సర్కరార్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు న్యూ పుణె మెట్రో సెక్షన్ను ప్రారంభించారు. జిల్లా కోర్డు, స్వర్గేట్ మధ్య నడిచే ఈ భూగర్భ మార్గంతో పుణెలోని అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీనితో పాటు రూ.11,200 కోట్ల విలువ చేసే ప్రాజెక్టుల శంకుస్థాపన చేసి, జాతికి అంకింతం చేశారు.
ముంబై యూనివర్శిటీ సెనేట్ ఎన్నికల్లో అన్ని సీట్లు శివసేన (యూబీటీ) యువజన విభాగం గెలుచుకోవడంపై ఆదిత్య థాకరే సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనుబంధ ఏబీవీపీ సహా అందరూ చిత్తుగా ఓడిపాయారని, మాతోశ్రీలో సంబరాలు మిన్నంటుతున్నాయని చెప్పారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారంనాడు సమీక్షించారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్.ఎస్.సంధు తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఎస్ఎస్ కర్యకర్తగా తాను పనిచేసినప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ అప్పట్లో తామెన్నో అవాంతరాలు ఎదుర్కొన్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చెప్పారు. తగిన గుర్తింపు కానీ, గౌరవం కానీ ఉండేవి కావన్నారు.
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన బద్లాపూర్ పాఠశాలలో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అక్షయ్ షిండే సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు.