Share News

Amit Shah: సీఎం కుర్చీపై ఎవరంటే.. పార్టీ నేతల సమావేశంలో అమిత్‌షా

ABN , Publish Date - Oct 01 , 2024 | 08:04 PM

బీజేపీ కీలక నేతల సమావేశంలో పార్టీ ఎన్నికల సన్నద్ధత, గెలుపు సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్రలో మహాకూటమి గెలిచిన తర్వాత ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామన్నారు.

Amit Shah: సీఎం కుర్చీపై ఎవరంటే.. పార్టీ నేతల సమావేశంలో అమిత్‌షా

ముంబై: మహారాష్ట్ర (Maharashtra)లో మళ్లీ మహాయుతి కూటమి (Grand Alliance) అధికారంలోకి వస్తే సీఎం పదవి ఏ పార్టీకి దక్కనుందనే ఊహాగానాలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తెరదించారు. మహారాష్ట్రలో వచ్చేది తమ కూటమి ప్రభుత్వేనని, బీజేపీ ముఖ్యమంత్రే అధికార పగ్గాలు చేపతారని మంగళవారంనాడిక్కడ జరిగి పార్టీ నేతల సమావేశంలో అమిత్‌షా తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలోనే ఎన్నికల కమిషన్ ప్రకటించనున్న నేపథ్యంలో అమిత్‌షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు.

PM Modi: కులమతాల పేరుతో దేశ ఐక్యతకు కాంగ్రెస్ విఘాతం


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బీజేపీ కీలక నేతల సమావేశంలో పార్టీ ఎన్నికల సన్నద్ధత, గెలుపు సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్రలో మహాకూటమి గెలిచిన తర్వాత ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామన్నారు. మహారాష్ట్ర సమస్యలను పరిష్కరించే సమర్ధత దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని, 10 శాతం ఓట్ల షేర్‌ను పెంచుకోవడంపై దృష్టిసారించాలని కోరారు. తద్వారా బీజేపీకి 20 నుంచి 30 అదనపు సీట్లు వస్తాయన్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు పార్టీలో చేరినా బీజేపీ కార్యకర్తలకు సరైన పొజిషన్లు, పార్టీలో గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో మహాకూటమి గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమిలో శివసేన, బీజేపీ, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి.


మరిన్ని జాతీయ వార్తల కోసం

ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..

Updated Date - Oct 01 , 2024 | 08:04 PM