PM Modi: పుణె మెట్రో సెక్షన్‌ను ప్రారంభించిన మోదీ
ABN , Publish Date - Sep 29 , 2024 | 03:04 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు న్యూ పుణె మెట్రో సెక్షన్‌ను ప్రారంభించారు. జిల్లా కోర్డు, స్వర్‌గేట్ మధ్య నడిచే ఈ భూగర్భ మార్గంతో పుణెలోని అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీనితో పాటు రూ.11,200 కోట్ల విలువ చేసే ప్రాజెక్టుల శంకుస్థాపన చేసి, జాతికి అంకింతం చేశారు.
పుణె: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారంనాడు న్యూ పుణె మెట్రో సెక్షన్‌ను ప్రారంభించారు. జిల్లా కోర్డు, స్వర్‌గేట్ మధ్య నడిచే ఈ భూగర్భ మార్గంతో పుణెలోని అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీనితో పాటు రూ.11,200 కోట్ల విలువ చేసే ప్రాజెక్టుల శంకుస్థాపన చేసి, జాతికి అంకింతం చేశారు. వర్చువల్ తరహాలో వీటిని ప్రధాని ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని హాజరుకావాల్సి ఉన్నప్పటికీ వాతావరణ ప్రతికూలత దృష్ట్యా ఆయన పర్యటన రద్దయింది.
మహాయుతి సర్కార్ విజన్
ప్రధాని వర్చువల్ తరహాలో ప్రారంభోత్సవాల సందర్భంగా మహారాష్ట్రలోని అధికార మహాయుతి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. పుణెలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సామర్థ్యం కూడా పెంచుకుంటూపోవాలని, పుణె పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఆధునీకరించినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం తాము అనేక చర్యలు చేపట్టామన్నారు. సిటీ పెరుగుతున్నప్పుడు ఏరియాల మధ్య అనుసంధానం కూడా గణనీయంగా పెరగాలన్నారు. ఇదే విజన్‌తో మహాయుతి ప్రభుత్వం రేయింబవళ్లు శ్రమిస్తోందని చెప్పారు.
PM Modi:మోదీ ఎమోషనల్.. తెలుగు వ్యక్తిపై ప్రశంసలు..
మహారాష్ట్రలో ఇంతకముందు అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం కనీసం ఒక మెట్రో పిల్లర్‌ను కూడా నిర్మించలేకపోయిందన్నారు. కానీ తమ ప్రభుత్వం పుణెలో మెట్రో నెట్‌వర్క్‌ను నిర్మించిందన్నారు. సోలార్ ఎయిర్‌పోర్ట్ అప్‌గ్రేడేషన్‌పై మాట్లాడుతూ, ఇవాళ విఠల్ భగవానుని ఆశీస్సులతో నేరుగా షోలాపూర్‌కు ఎయిర్ కనెక్టివిటీ కల్పించేందుకు ఎయిర్‌పోర్ట్ అప్‌గ్రేడేషన్ పూర్తయిందని చెప్పారు.
For National News And Telugu News..
ఇది కూడా చదవండి...