Home » Maharashtra
దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చిందని గుర్తుచేశారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారంలో మహిళలను కించపరచేలా వ్యవహరించకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఈసీ సూచించారు. వ్యక్తిగత జీవితాలపై విమర్శలు కూడదని, రాజకీయ ప్రత్యర్థులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయరాదని అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధులేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ శుక్రవారంనాడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ ఎజెండాను, కశ్మీర్లో వేర్పాటువాద భాషను ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొట్టాలన్నారు.
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రధాని ప్రశంసించారు. తిరిగి ఇదే ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి పనులు ముందుకు దుసుకువెళ్తాయని చెప్పారు. గత 2.5 సంవత్సరాల్లో మహాయుతి సర్కార్ చేసిన అభివృద్ధిని కొనసాగించేందుకు తాను భరోసాగా నిలుస్తానని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మోదీ వారం రోజుల్లో దాదాపు పది ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రచారం వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లికాని ప్రసాదులకు విచిత్ర హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తొలగించిన మహారాష్ట్ర డీజీపీ రశ్మి శుక్లా స్థానంలో సంజయ్ కుమార్ వర్మను నూతన డీజీపీగా మంగళవారం నియమించారు.
మహారాష్ట్రలో రెబల్స్ బెడద వల్ల ఓట్లు చీలి పార్టీల గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మమహాయుతి, మహా వికాస్ అఘాడి కూటములు తెరవెనుక నామినేషన్ల ఉపసంహరణకు ప్రయత్నాలు సాగించాయి. కొందరు అసంతృప్తి నేతలు ఆయా పార్టీలకు రాజీనామా చేశారు.
పద్నాలుగు సార్లు తాను ఎన్నికల్లో పోటీ చేసానని, ప్రస్తుత రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత పార్లమెంటరీ స్థానాన్ని విడిచిపెట్టాలా వద్దా అనే దానిపై ఆలోచిస్తానని చెప్పారు. ప్రజా సేవ చేసేందుకు ఎన్నికల్లో గెలవాల్సిన పని లేదని, కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.