Eknath Shinde: ఏక్‌నాథ్ షిండే కొత్త షరతు...తెరపైకి శ్రీకాంత్ షిండే
ABN , Publish Date - Nov 27 , 2024 | 03:38 PM
తన కుమారుడిని ఉప ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వంలో పదవులకు తాను దూరంగా ఉండాలని ఏక్‌నాథ్ షిండే చేస్తున్న ప్రతిపాదనతో సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందువల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని వారంటున్నారు.
ముంబై: మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ ఓవైపు కొనసాగుతుండగా, మరో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. శివసేన చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) తన కుమారుడు శ్రీకాంత్ షిండే (Srikant Shinde)ను దేవేంద్ర ఫడ్నవిస్ క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. శ్రీకాంత్‌ను డిప్యూటీ సీఎంను చేస్తే తాను ప్రభుత్వానికి దూరంగా ఉంటానని ఆయన చెబుతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
Maharashtra CM: మహారాష్ట్ర సీఎం సస్పెన్స్ నేటితో క్లోజ్.. బీహార్ ఫార్ములాపై క్లారిటీ
షిండే ప్రతిపాదనపై పార్టీలో వ్యతిరేకత
కాగా, తన కుమారుడిని ఉప ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వంలో పదవులకు తాను దూరంగా ఉండాలని ఏక్‌నాథ్ షిండే చేస్తున్న ప్రతిపాదనతో సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందువల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని వారంటున్నారు. ముఖ్యంగా ఉద్థవ్ థాకరే తన కుమారుడు ఆదిత్య థాకరేను ప్రమోట్ చేసుకుంటున్న తరుణంలో ఈ చర్య మంచిది కాదని వారంటున్నారు.
మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు దేవేంద్ర ఫడ్నవిస్‌కు అప్పగించడం దాదాపు ఖాయమైంది. ఫడ్నవిస్‌కు బీజేపీ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 25న బీజేపీ కేంద్ర నేత ఒకరు షిండేతో ఫోనులో మాట్లాడి ఫడ్నవిస్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారని, దీంతో 26న షిండే తన పదవికి రాజీనామా సమర్పించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే 'మహాయుతి' కూటమి నిర్ణయం తీసుకుంటే ఫడ్నవిస్‌ను సీఎంగా తాము అంగీకరిస్తామని ఏక్‌నాథ్ షిండే శివసేన ఎంపీ నరేష్ మాస్కే తెలిపారు.
అజిత్‌కు మళ్లీ ఉప ముఖ్యమంత్రి పదవి
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు తిరిగి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆర్థిక మంత్రి బాధ్యతలు అప్పగిస్తారు. ఏక్‌నాథ్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవికి ఆయన ఒప్పుకోకుంటే కేంద్ర క్యాబినెట్‌లో చోటు కల్పిస్తారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో డిసెంబర్ 2న కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Google Maps: ఉత్తరప్రదేశ్‌లో కారు ప్రమాదం... స్పందించిన గూగుల్
Nagendra: మళ్లీ కేబినెట్‌లోకి నాగేంద్ర..
Sanatan Board: 'సనాతన్ ధర్మ రక్షా బోర్డు' ఏర్పాటు పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
Read More National News and Latest Telugu News