Share News

Sanjay Raut: ఇంకెవరు? ఆయనే సీఎం: సంజయ్ రౌత్

ABN , Publish Date - Nov 26 , 2024 | 06:56 PM

ప్రభుత్వం ఏర్పాటు కోసం పార్టీల మధ్య చిచ్చుపెట్టడం, విడగొట్టడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని సంజయ్ రౌత్ ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ మెజారిటీకి కొన్ని సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నందున అధికారం వారి చేతిలో ఉందనే విషయాన్ని తాను అంగీకరిస్తారనని అన్నారు.

Sanjay Raut: ఇంకెవరు? ఆయనే సీఎం: సంజయ్ రౌత్

ముంబై: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనే సస్పెన్స్ ఓవైపు కొనసాగుతుండగా, 'మహాయుతి' భాగస్వామ్య నేతలు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌పై శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) విరుచుకుపడ్డారు. ఆ ఇద్దరు నేతల పార్టీలు 'భారతీయ జనతా పార్టీ సబ్ కంపెనీలు' అని విమర్శలు గుప్పించారు. సీఎం ఎవరు కావచ్చనే ప్రశ్నకు కూడా ఆయన సూటిగా స్పందించారు.

Ballot Paper voting: మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివి, ఓడితే ట్యాంపరింగా?: కేఏ పాల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం


మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అవకాశం భాగస్వామ్య పార్టీలైన శివసేన, ఎన్‌సీపీ ఇవ్వకుండా బీజేపీ నియంత్రిస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. ''కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలిసి సీఎంను నిర్ణయిస్తారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు తమ సొంత పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కూడా లేరు. ఈ రెండు పార్టీలు అమిత్‌షా, మోదీలకు కట్టుబానిసల్లా, బీజేపీకి ఉప కంపెనీలుగా మారాయని విమర్శించారు.


పార్టీలను విడగొట్టడం వెన్నతో పెట్టిన విద్య

ప్రభుత్వం ఏర్పాటు కోసం పార్టీల మధ్య చిచ్చుపెట్టడం, విడగొట్టడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని సంజయ్ రౌత్ ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ మెజారిటీకి కొన్ని సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నందున అధికారం వారి చేతిలో ఉందనే విషయాన్ని తాను అంగీకరిస్తారనని, మెజారిటీ రాని పక్షంలో ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ పార్టీలను చీల్చి అయినా మెజారిటీని సొంతం చేసుకుంటారని అన్నారు. పార్టీలను చీల్చడంలో వాళ్లు (బీజేపీ) నిపుణులని, ఈ విషయాన్ని గతంలోనూ మహారాష్ట్రలో చూశామని ఆయన గుర్తు చేశారు.


ఆయనే సీఎం

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరవుతారనే ప్రశ్నకు దేవేంద్ర ఫడ్నవిస్‌ అవుతారంటూ సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే మంగళవారం ఉదయం రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకూ ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆయన రాజీనామాతో కొత్త సీఎం ఎంపికకు కూడా మార్గం సుగమమైంది.


ఇవి కూడా చదవండి..

Maharashtra: 'మహా' సర్కార్ ప్రమాణస్వీకారం ముహూర్తం ఇదేనట

President Droupadi Murmu: ప్రత్యక్ష, ప్రగతిశీల పత్రమే.. ‘‘రాజ్యాంగం’’

Dy CM: మళ్లీ ద్రావిడ పాలన కోసం పాటుపడండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 26 , 2024 | 06:56 PM