Home » Mamata Banerjee
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కుతారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే..
ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్దమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పేర్కొన్నాయి. ఆ సంస్థల నివేదికలను దీదీ తప్పు పట్టారు.
సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనున్న వేళ.. కన్నియాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం అంశం రాజకీయంగా కాక రేపుతోంది. బీజేపీపై ప్రతిపక్షాలు ముకుమ్మడిగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. అయితే ప్రధాని మోదీ ధ్యానం అంశాన్ని మీడియాలో ప్రసారం చేయవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సీపీఐ (ఎం) విజ్జప్తి చేసింది.
మన భారతదేశానికి నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి అవసరం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాను ఎంతోమంతి ప్రధానమంత్రులతో కలిసి పని చేశానని..
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. జూన్1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. జూన్4న ఓట్లు లెక్కిస్తారు. దీంతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఫలితాలకు మూడు రోజుల ముందు ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి పనితీరు, పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలను అంచనా వేయడం, తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు జూన్ 1వ తేదీన 'ఇండియా' కూటమి న్యూఢిల్లీలో కీలక సమావేశం జరుపనుంది. అయితే, ఈ సమావేశానికి కూటమి భాగస్వామిగా ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రతినిధులు ఎవరూ హాజరుకావడం లేదని తెలుస్తోంది.
ఈవీఎం మేషిన్లకు ఉన్న ట్యాగ్‌పై బీజేపీ ప్రతినిధి సంతకం మాత్రమే ఉండడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం శనివారం స్పందించింది.
ఓటు బ్యాంకు కోసం జాతీయ భద్రతతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీపడుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తప్పుపట్టారు. చొరబాటుదారులను రాష్ట్రంలోకి అనుమతించడం ద్వారా ఆమె పాపానికి పాల్పడుతున్నారని అన్నారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్ పై భారత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. 24 గంటల పాటు ఆయన ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించింది.
తమ సంస్థ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ముర్షిదాబాద్‌లోని భారత్ సేవాశ్రమ్ సంఘ్‌కు చెందిన స్వామి ప్రదీప్తానంద మహరాజ్ పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి......