Share News

Exit Poll: రెండునెలల క్రితమే రూపకల్పన.. దీదీ నిప్పులు

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:43 AM

ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్దమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పేర్కొన్నాయి. ఆ సంస్థల నివేదికలను దీదీ తప్పు పట్టారు.

Exit Poll: రెండునెలల క్రితమే రూపకల్పన.. దీదీ నిప్పులు
Mamata Banerjee

కోల్ కతా: ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్దమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పేర్కొన్నాయి. ఆ సంస్థల నివేదికలను దీదీ తప్పు పట్టారు. అలాంటి ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాంటి విలువ ఉండదని ఆమె స్పష్టం చేశారు. ఆ పోల్స్‌ను చూపించడం మీడియా తప్పిదం కూడా ఉందని విరుచుకుపడ్డారు.


ఆ పోల్స్ నిజం కాలే..!!

‘2016, 2019, 2021లో ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహించారో మనం చూశాం. ఆ పోల్స్ ఏవీ కూడా నిజం కాలేదు. ఎందుకంటే కొందరు వాటిని నెలల క్రితం తమ ఇంట్లో రూపొందించారు. బెంగాల్‌లో జరిగిన తన ర్యాలీలు, బహిరంగ సభలకు భారీగా జనం తరలి వచ్చారు. అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎలా నిజం అవుతాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాను ముస్లింలు తీసుకుంటారని బీజేపీ తప్పుడు ప్రచారం చేసింది. దాంతో ముస్లింలు బీజేపీకి ఓటు వేశారని అనుకోను. పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ, కాంగ్రెస్ బీజేపీకి సాయం చేశాయి అని’ మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.


టీఎంసీకి 13 నుంచి 17 సీట్లు..?

పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 23 నుంచి 27 సీట్లను బీజేపీ గెలుస్తోందని ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. టీఎంసీ 13 నుంచి 17 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఇండియా బ్లాక్ 1 నుంచి 3 సీట్లు వస్తాయని పేర్కొంది. మిగతా సంస్థలు కూడా ఇంచు మించు అలానే రిపోర్ట్స్ ఇచ్చాయి. 2019లో టీఎంసీ 22, బీజేపీ 18 సీట్లను గెలిచిన సంగతి తెలిసిందే.

Updated Date - Jun 03 , 2024 | 11:43 AM