INDIA bloc meet: 'ఇండియా' కూటమికి సమావేశానికి మమత దూరం..!
ABN , Publish Date - May 27 , 2024 | 08:00 PM
సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి పనితీరు, పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలను అంచనా వేయడం, తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు జూన్ 1వ తేదీన 'ఇండియా' కూటమి న్యూఢిల్లీలో కీలక సమావేశం జరుపనుంది. అయితే, ఈ సమావేశానికి కూటమి భాగస్వామిగా ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రతినిధులు ఎవరూ హాజరుకావడం లేదని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి పనితీరు, పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలను అంచనా వేయడం, తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు జూన్ 1వ తేదీన 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి న్యూఢిల్లీలో కీలక సమావేశం జరుపనుంది. అయితే, ఈ సమావేశానికి కూటమి భాగస్వామిగా ఉన్న మమతా బెనర్జీ (Mamata Banerjee) సారథ్యంలోని టీఎంసీ (TMC) ప్రతినిధులు ఎవరూ హాజరుకావడం లేదని తెలుస్తోంది. ఇదే రోజు (June 1) లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ ఉండటం కారణంగా చెబుతున్నారు. ఆరోజు టీఎంసీ సుప్రీం మమతా బెనర్జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఇతర అగ్రనేతలు ఓటు వేయాల్సి ఉందని, ఇదే విషయాన్ని 'ఇండియా' కూటమి నిర్వాహకులకు కూడా టీఎంసీ ఇప్పటికే తెలియజేసిందని ఆ పార్టీ వర్గాల సమాచారం.
Lok Sabha Elections: ఖర్గేను కాంగ్రెస్ సాగనంపడం ఖాయం.. అమిత్‌షా జోస్యం
బెంగాల్‌లో ప్రత్యర్థులు, జాతీయ స్థాయిలో భాగస్వాములు
ఆసక్తికరంగా, ఇండియా కూటమి భాగస్వాములుగా ఉన్న టీఎంసీ, కాంగ్రెస్లు పశ్చిమబెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేస్తు్న్నాయి. అయితే, జాతీయ స్థాయిలో తాము ఇండియా కూటమి భాగస్వాములుగానే కొనసాగామని మమతా బెనర్జీ ప్రకటించారు. తాము ఇండియా కూటమిలోనే ఉన్నామని, ఒకరరంగా ఇండియా కూటమి తన బ్రెయిన్ చైల్డ్ అని మమత ఇటీవల స్పష్టత ఇచ్చారు.