Share News

ECI: సీఎంపై నోరుపారేసుకున్న బీజేపీ అభ్యర్థికి ఈసీ షాక్..

ABN , Publish Date - May 21 , 2024 | 06:26 PM

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్‌ పై భారత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. 24 గంటల పాటు ఆయన ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించింది.

ECI: సీఎంపై నోరుపారేసుకున్న బీజేపీ అభ్యర్థికి ఈసీ షాక్..

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్‌ (Abhijit Gangopadhyay)పై భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) చర్యలు తీసుకుంది. 24 గంటల పాటు ఆయన ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు అమలులోకి వచ్చిన ఈ నిషేధం బుధవారం సాయంత్రం 5 గంటల వరకూ అమల్లో ఉంటుంది.

Prashant Kishor: బీజేపీకి ఎన్ని లోక్‌సభ సీట్లు వస్తాయంటే... పీకే జోస్యం


పశ్చిమబెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా తమ్లుక్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అభిజిత్ పోటీలో ఉన్నారు. మే 15న హల్డియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మమతాబెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''మమతా బెనర్జీ, మీరు ఎంతకు అమ్ముడు పోయారు? మీ రేటు రూ.10 లక్షలు, ఎందుకంటే మీరు కేయా సేథ్‌తో మేకప్ చేయించుకుంటున్నారు. మమత అసలు మహిళేనా అని నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటాను'' అంటూ అభిజిత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. న్యాయవ్యవస్థలో ఉన్నత పదవిని నిర్వహించిన వ్యక్తి ఒక మహిళను కించపరచేలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. దీనిపై అభిజిత్‌కు ఈనెల 17న ఈసీ నోటీసు ఇచ్చింది. 20వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఆయన సమాధానాన్ని సమీక్షించిన అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంపై 24 గంటల పాటు నిషేధం విధించింది.

Read Latest National News and Telugu News

Updated Date - May 21 , 2024 | 06:26 PM