Home » Mamata Banerjee
ఉపాధ్యాయుల భర్తీ కుంభకోణంపై సుప్రీంకోర్టు మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది. ఇలాంటి మోసాలు జరిగితే ప్రజలు వ్యవస్థలపై విశ్వాసాన్ని కోల్పోతారని వ్యాఖ్యానించింది.
బెంగాల్ ప్రభుత్వం బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల రద్దుపై కోల్కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
సోషల్ మీడియాలో ప్రముఖుల మీమ్స్ సందడి చేస్తుంటాయి. కొందరు క్రియేటర్స్ మీమ్స్ చేసి పోస్ట్ చేస్తుంటారు. మీమ్స్ చూసి కొందరు లైట్ తీసుకుంటారు. మరికొందరు సీరియస్‌గా తీసుకొని, కేసులు పెడతారు.
లైంగిక వేధింపులకు సంబంధించి తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కోల్‌కతా పోలీసుల నుంచి వచ్చే సమన్లను పట్టించుకోవద్దని రాజ్‌భవన్ సిబ్బందిని పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆదివారం ఆదేశించారు.
పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ ప్రభుత్వం స్కామ్‌ల్లో రికార్డు సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఈ ప్రభుత్వంలో వివిధ రంగాల్లో స్కామ్‌లు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్టెపులు వేశారు. అందుకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో వైరల్ అవుతుంది. గురువారం నడియా జిల్లాలోని తిహట్టాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మొహువా మోయిత్రికి మద్దతుగా సీఎం మమతా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సీబీఐపై తమ కంట్రోల్ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు(Supreme Court) తేల్చిచెప్పింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 131 ప్రకారం ఈ కేసు వేసింది.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన మొదటి, రెండో విడత పోలింగ్ తుది వివరాలను ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది.
పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కునల్ ఘోష్‌ను తొలగించింది. పార్టీ వైఖరికి అనుగుణంగా ఘోష్ అభిప్రాయాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీఎంసీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
లోక్‌సభ ఎన్నికల తొలి విడత, రెండో విడతల్లో ఓటింగ్ డేటాను సవరిస్తూ ఎన్నికల కమిషన్ తుది జాబితా ప్రకటించడం, ఇందులో ఓటర్ టర్న్ అవుట్ అకస్మాత్తుగా పెరగడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సందేహాలు వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ తాజా గణాకాంల్లో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.