Share News

West Bengal: పోలీసుల సమన్లను పట్టించుకోవద్దు.. రాజ్‌భవన్‌ సిబ్బందికి బెంగాల్‌ గవర్నర్‌ ఆదేశం

ABN , Publish Date - May 06 , 2024 | 04:15 AM

లైంగిక వేధింపులకు సంబంధించి తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కోల్‌కతా పోలీసుల నుంచి వచ్చే సమన్లను పట్టించుకోవద్దని రాజ్‌భవన్‌ సిబ్బందిని పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ ఆదివారం ఆదేశించారు.

West Bengal: పోలీసుల సమన్లను పట్టించుకోవద్దు.. రాజ్‌భవన్‌ సిబ్బందికి బెంగాల్‌ గవర్నర్‌ ఆదేశం

కోల్‌కతా, మే 5: లైంగిక వేధింపులకు సంబంధించి తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కోల్‌కతా పోలీసుల నుంచి వచ్చే సమన్లను పట్టించుకోవద్దని రాజ్‌భవన్‌ సిబ్బందిని పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ ఆదివారం ఆదేశించారు. గవర్నర్‌ తనను లైంగికంగా వేధించారంటూ రాజ్‌భవన్‌లో పనిచేసే మహిళా ఉద్యోగి చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసేందుకు కోల్‌కతా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గవర్నర్‌ తాజా ఆదేశాలు జారీ చేశారు. సిట్‌ తన దర్యాప్తులో భాగంగా రాజ్‌భవన్‌కు చెందిన సీసీటీవీ ఫుటేజీలను ఇవ్వాలని కూడా కోరింది. కాగా, ఆనందబోస్‌ తన ఆదేశాల్లో చట్టపరమైన చర్యల విషయంలో రాజ్యాంగం గవర్నర్లకు కల్పించిన మినహాయింపులను ప్రస్తావించారు.

Updated Date - May 06 , 2024 | 04:15 AM