Home » Mancherial district
మూడేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని శుక్రవారం ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులతో పాటు యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
గ్రూప్ 2, 3 పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైద్రాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అదనపు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షలు డిసెంబరు 15, 16 తేదీల్లో, గ్రూప్ 3 నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహిస్తారన్నారు.
శ్రీరాంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా అండర్ 14, 17, 19 ఎంపిక పోటీలు పూర్తయినట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, స్కూల్ గేమ్స్ క్రీడా సమాఖ్య కార్యదర్శులు చెరుకు ఫణిరాజా, బాబురావు అన్నారు. అనంతరం ఎంపికైన క్రీడాకారుల జాబితాను వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువై విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభు త్వాలు మారినప్పుడల్లా పనులు నిలిచిపోతుండడంతో సమస్యలకు పరిష్కా రం లభించడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి పథకం అర్థాంత రంగా నిలిచిపోవడంతో పనులు నిలిచిపోయాయి.
పత్తి రైతులు నేల రకాన్ని బట్టి విత్తన యాజమాన్య సాగు పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధిస్తారని జిల్లా వ్యవసాయాధికారి కల్పన అన్నారు. గురువారం నాగ్‌పూర్ జాతీయ పత్తి పరిశోధన సంస్థ బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నిర్వహించిన అధిక సాంద్రత-పత్తిలో క్షేత్ర దినోత్సవం కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.
మతం ఏదైనా మానవత్వాన్ని పెంపొందించి అన్ని మతాలను సమానంగా గౌరవించినప్పుడే ప్రపంచ శాంతి నెలకొంటుందని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం కల్వరి చర్చి నిర్వాహకులు ప్రవీణ్‌కుమార్-షారోన్ నిర్వహించిన 50 రోజుల ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు.
మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా కృషి చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మహిళలు వ్యాపారాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెం దేందుకు ప్రోత్సహిస్తున్నామని, ఈ క్రమంలో జిల్లాలో క్యాంటీన్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు సెప్టెంబరు 19 నుంచి 28 వరకు హైద్రాబాద్‌లో శిక్షణ ఇచ్చారు.
బతుకమ్మ చీరల పంపిణీ ఆం దోళనలు, నిరసనల మధ్య గురువారం నిలిచిపోయింది. మండలానికి 10770 చీరలు బుధవారం వచ్చాయి. వీటిని ఇందిరాక్రాంతి పథం సభ్యులకు అప్ప గించారు. స్వయం సహాయక సంఘంలోని సభ్యులకు మాత్రమే చీరలు అం దజేయాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వివిధ వర్గాలకు చెందిన పిల్లల కోసం కస్తూర్బా, జ్యోతిబాపూలే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ పేర్లతో పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ఆయా పాఠశాలలకు సొంత భవనాలు లేకపోవడంతో ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకొని స్కూళ్లను ప్రారంభించింది. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యంతోపాటు అవసరమైన అన్ని వసతులను సమకూర్చింది.
బతుకమ్మ, దసరా పండగలకు ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపించడంతో కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. పండుగ సెలవులు ముగియడంతో జిల్లా ప్రజలు పట్టణాల బాట పట్టారు.