అన్ని మతాలను గౌరవించాలి
ABN , Publish Date - Oct 17 , 2024 | 11:47 PM
మతం ఏదైనా మానవత్వాన్ని పెంపొందించి అన్ని మతాలను సమానంగా గౌరవించినప్పుడే ప్రపంచ శాంతి నెలకొంటుందని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం కల్వరి చర్చి నిర్వాహకులు ప్రవీణ్‌కుమార్-షారోన్ నిర్వహించిన 50 రోజుల ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు.
కాసిపేట, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మతం ఏదైనా మానవత్వాన్ని పెంపొందించి అన్ని మతాలను సమానంగా గౌరవించినప్పుడే ప్రపంచ శాంతి నెలకొంటుందని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం కల్వరి చర్చి నిర్వాహకులు ప్రవీణ్‌కుమార్-షారోన్ నిర్వహించిన 50 రోజుల ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. మతాల పేరుతో దేశంలో కొందరు రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టిస్తున్నారని, మతాలను రెచ్చగొట్టి ఇతర దేవుళ్లపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు.
మతాలను, దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దని, కాని కొందరు దేవుళ్లను రాజకీయ ఎజెండాలోనికి లాగి మత విశ్వాసాలపై దాడులు చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలు సహేతుకమైనవి కావన్నారు. కల్వరి చర్చి నిర్వాహకులు ప్రవీణ్‌కుమార్ ప్రపంచ శాంతి కోసం ఉపవాస దీక్షలు చేయడాన్ని అభినందించారు. అనంతరం చర్చి నిర్వాహకులు అతిథులను సన్మానించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎంఎల్‌సీ దండె విఠల్, మాజీ మంత్రి వేణుగోపాల్ చారి, మున్సిపల్ చైర్‌పర్సన్ జక్కుల శ్వేతశ్రీధర్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.