ఫెన్సింగ్ ఎంపిక పోటీలు పూర్తి
ABN , Publish Date - Oct 18 , 2024 | 10:28 PM
శ్రీరాంపూర్‌లోని సీఈఆర్ క్లబ్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా అండర్ 14, 17, 19 ఎంపిక పోటీలు పూర్తయినట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, స్కూల్ గేమ్స్ క్రీడా సమాఖ్య కార్యదర్శులు చెరుకు ఫణిరాజా, బాబురావు అన్నారు. అనంతరం ఎంపికైన క్రీడాకారుల జాబితాను వెల్లడించారు.
శ్రీరాంపూర్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి) : శ్రీరాంపూర్‌లోని సీఈఆర్ క్లబ్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా అండర్ 14, 17, 19 ఎంపిక పోటీలు పూర్తయినట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, స్కూల్ గేమ్స్ క్రీడా సమాఖ్య కార్యదర్శులు చెరుకు ఫణిరాజా, బాబురావు అన్నారు. అనంతరం ఎంపికైన క్రీడాకారుల జాబితాను వెల్లడించారు. వీరందరికి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆవునూరి మహేష్, చెరుకు అనిల్, సీనియర్ క్రీడాకారులు ఈదునూరి వెంకటేశ్, ఎర్ర కిశోర్, పీఈటీలు రాజేందర్, కుమార్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
అండర్-14 బాలికలు : నిక్షిత, సనా, క్షేత్ర, వైష్ణవి, లావణ్య, సుహానా, హిమనీరెడ్డి, ఆరాధ్య, యోగితాశ్రీ, నిత్యాశ్రీ, శ్రీవల్లి, వైష్ణవి ఎంపిక కాగా, స్టాండ్ బైగా విష్ణుప్రియ, అయేషా ఫాతిమా ఉన్నారు.
అండర్-14 బాలురు : రిత్విక్ రెడ్డి, సిద్ధార్థ, అయాన్ ఖాన్, సాయి యశ్వంత్, అర్జిత్, రిషిచరణ్, శ్రీహాస్ పటేల్, పూర్ణసాయి, శ్రీచరణ్, సాత్విక్, ఆదిత్య, మణిదీక్షిత్ ఎంపికయ్యారు.
అండర్-17 బాలికలు : వెన్నెల, శ్రావ్య, అర్చన, సమోజ్‌వాలా, ఐశ్వర్య, జ్యోతి, సాయిశృతిక, దీక్షిత, వైష్ణవి ఎంపికయ్యారు.
అండర్-17 బాలురు : రాజ్, హర్షవర్ధన్, జశ్వంత్, మనీష్, రోషన్, వెంకటసాయి, అశ్విత్, సిద్ధార్థ్, సాత్విక్, అనికేత్, సంజయ్ ఎంపిక కాగా, స్టాండ్‌బై గా రాజేందర్, హన్షిత్, మణిదీక్షిత్ ఉంటారని నిర్వాహకులు పేర్కొన్నారు.
అండర్-17 ఎస్‌జీఎఫ్ క్రికెట్ పోటీలు
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 18 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి అండర్-17 బాలబాలికల క్రికెట్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎస్‌జీఎఫ్ సెక్రెటరి రాంమోహన్, క్రికెట్ కోచ్ ప్రదీప్‌లు ప్రారంభించారు. ఈ పోటీల్లో 100 మంది బాలురు, 20 మంది బాలికలు తలపడ్డారు. ఆర్గనైజర్ సిరంగి గోపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు రేణి రాజయ్య, విట్టల్, నందం శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్, స్టీఫెన్ రవీంద్ర, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.