Home » Mancherial district
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల కబ్జా పరిపాటిగా మారింది. స్థలంలో మొదట తాత్కాలిక గుడిసెలు వేసి అదును చూసి పక్కా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. పట్టణంలోని అండా ళమ్మ కాలనీలో ప్రస్తుతం ఇదే తంతు కొనసాగుతోంది. అండాళమ్మ కాలనీ జిల్లా కేంద్రానికి శివారులో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న చోటా, మోటా నాయకులు గుట్టుచప్పుడు కాకుండా స్థలాలను చేజిక్కించుకుంటున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఐబీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్ధిక, రాజకీయ, విద్య, కుల గణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి కల్పన పేర్కొన్నారు. ఆదివారం బీసీ కాలనీలో జిల్లా పంచాయతీ అధికారి, ముదిరాజ్ కాలనీలో జరుగుతున్న సర్వేను మండల ప్రత్యేకాధికారి పరిశీలించారు.
కార్తీక మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 25వేల మందిపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అభయాంజనేయస్వామి ఆలయ భూములను రక్షించాలని బీజేపీ నాయకులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ మాట్లాడుతూ గతం లో ఆలయ భూములను కబ్జా చేశారని కమిటీ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారని, అదికారులు సర్వేచేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపారన్నారు.
ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అనుమతులు తీసుకుంటాం. అనంతరం నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టవలసి ఉంటుంది. అందుకు భిన్నంగా నస్పూర్ మున్సిపాలిటీలో కట్టిన ఇళ్లకు నిర్మాణ అనుమతులు జారీ చేయడం చర్చనీయాంశమవుతోంది. ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన వెంచర్లో ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది.
కులగణనపై అన్ని కుల సంఘాల నాయకులు తెలిపిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్హాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై అన్ని కుల సంఘాలతో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హైద్రాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా మద్దతు ధర నిర్ణయించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోందని, జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ప్రభుత్వంపై ధర్మయుద్ధం ఆగదని ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జ్యోతి పంక్షన్ హాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ధర్మయుద్ధ సదస్సు నిర్వహించారు.
పత్తి రైతు పరేషాన్లో పడ్డాడు. సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా ఉన్న పత్తి పంట ఆఖరు దశలో తెగుళ్లు, చీడపీడలు విజృంభించడంతో దెబ్బతింటోంది. తెగులు ఉధృతికి రెండో దఫా పిందె కాయ కట్టక ముందే ఆకులు రాలిపోతున్నాయి. వర్షాలు లేక బలహీన పడిన పంటకు తెగులు తోడై నెల రోజుల ముందే చేలు ఎండిపోతున్నాయి. మరోవైపు లద్దెపురుగు విజృంభణ రైతులను బెంబేలెత్తిస్తోంది. రసాయన మందులు పిచికారి చేసినా లాభం లేదని రైతులు వాపోతున్నారు. ప్రతికూల వాతావరణం, చీడపీడల దాడి వెరసి దిగుబడి సగానికి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.