Share News

ఆదివాసీ కుటుంబాలకు పోలీసుల అండ

ABN , Publish Date - Jan 10 , 2025 | 11:10 PM

ఆది వాసీ కుటుంబాల సంక్షేమమే పోలీసుల ధ్యేయ మని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. శుక్రవారం మాదారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నర్సాపూర్‌ (బెజ్జాల) గ్రామంలో తాండూర్‌ సర్కిల్‌ పోలీసులు, రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకా రంతో కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమంలో భాగంగా పోలీసులు మీ కోసం కార్యక్రమం నిర్వహించారు.

ఆదివాసీ కుటుంబాలకు పోలీసుల అండ

తాండూర్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఆది వాసీ కుటుంబాల సంక్షేమమే పోలీసుల ధ్యేయ మని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. శుక్రవారం మాదారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నర్సాపూర్‌ (బెజ్జాల) గ్రామంలో తాండూర్‌ సర్కిల్‌ పోలీసులు, రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకా రంతో కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమంలో భాగంగా పోలీసులు మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఆదివాసీ గిరిజన కుటుంబాలకు దుప్పట్లు, సరుకులు, వంట సామగ్రి, చీరలు, ధోతులు, లుంగీలు అందజేశారు.

డీసీపీ మాట్లా డుతూ ప్రజల కోసమే పోలీసులు పనిచేస్తు న్నారని తెలిపారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తు తం ఎన్నో సౌకర్యాలు మెరుగుపడ్డాయని తెలి పారు. ఆదివాసీ గిరిజన యువకులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదు వుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ప్రభు త్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియో గం చేసుకోవాలన్నారు. గిరిజనుల శ్రేయస్సుకు పోలీసులు ఎప్పుడు కృషి చేస్తారన్నారు. గిరి జనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రలోభాలకు గురి చేసి చెడు మార్గాల వైపు ప్రోత్సహించేలా చేస్తారని, ప్రలోభాలకు లొంగకుండా మంచిని ఎంచుకుని సమాజ శ్రేయస్సకు కృషి చేయాల న్నారు. అనంతరం ఆదివాసీ గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, మాదారం ఎస్‌ఐ సౌజన్య, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, సొసైటీ సభ్యులు అభినవ సంతోష్‌కుమార్‌, సురబి శరత్‌కుమార్‌, లక్ష్మీ నారాయణ, రవీందర్‌రెడ్డి, గ్రామ పెద్దలు పర్వ తిరావు, తిరుపతి, కన్నయ్య, బాపు, హన్మంతు, బాబు, జమున, సీతాబాయి, పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 11:10 PM