Share News

మాతా శిశు మరణాల నియంత్రణకు కృషి

ABN , Publish Date - Jan 10 , 2025 | 11:13 PM

జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు అర్మాన్‌ సంస్థ ద్వారా ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని 230 మంది ఆరోగ్య కార్యకర్తలకు అర్మాన్‌ సంస్థ ఇస్తున్న శిక్షణను ప్రారంభించారు.

మాతా శిశు మరణాల నియంత్రణకు కృషి

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు అర్మాన్‌ సంస్థ ద్వారా ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని 230 మంది ఆరోగ్య కార్యకర్తలకు అర్మాన్‌ సంస్థ ఇస్తున్న శిక్షణను ప్రారంభించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో మాతాశిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నా మని తెలిపారు. గర్భం దాల్చిన మహిళలు పీహెచ్‌సీ, ప్రభుత్వ ఆసు పత్రులలో వివరాలు నమోదు చేసుకుని మందులు, పౌష్టికాహారం తీసు కునేలా అవగాహన కల్పించాలన్నారు. శిక్షణలో రక్తహీనత, అధిక రక్తపోటు, మధుమేహం, సీ సెక్షన్‌, కామెర్లు, క్షయ, పిండం ఎదుగు దలకు ముందు రక్తస్రావం తదితర వాటిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్యమిషన్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. అనంతరం శిక్షణ కరదీపికలను విడుదల చేశారు. డాక్టర్‌లు కృపాబాయి, ప్రోగ్రాం ఆఫీసర్‌ అనిత, ఉప వైద్యాధికారి సీతారామరాజు, డాక్టర్‌లు ప్రసాద్‌, అనిత్‌, కాంతారావు, ఎస్‌వో ప్రశాంతి, డీపీవో ప్రవళిక, డీడీఎం పద్మ, డీపీహెచ్‌ఎన్‌ అనిల్‌, జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 11:13 PM