Home » Mancherial
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్‌లతో కలిసి మంచిర్యాలలోని 5, 27వ వార్డుల్లో పరిశీలించారు.
దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్ధికి కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం ఆజాద్ జయంతిని కలెక్టరేట్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఆజాద్ చిత్రపటనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కొన్ని రోజులుగా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో పులి సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే తాజాగా అది ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది.
పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని సాయికుంటలో స్పోర్ట్స్ సేడియం ఏర్పాటుకు 12 ఎకరాల స్థలాన్ని శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే స్థలానికి సంబంధించిన హద్దుల ను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసేందుకు తెచ్చిన వీధి శునకాలు మృత్యువాత పడిన ఘటనపై అధికార యంత్రాంగం కదిలింది. మంచిర్యాల పశు సంరక్షణ కేంద్రంలో చనిపోయిన వీధి శునకాల కళేబరాలను సిబ్బంది శుక్రవారం తొలగించారు.
జిల్లా కేం ద్రంలోని అండాళమ్మ కాలనీలోగల పశు సంరక్షణ కేంద్రం నుంచి మృతి చెందిన శునకాల కళేబరాలను శుక్రవారం ఉదయం సిబ్బంది తొలగించారు. ‘ఈ పాపం ఎవరిది?’ శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రచు రితమైన కథనానికి కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ పశు సంరక్షణ కేంద్రానికి చేరుకుని డాగ్ క్యాచ ర్లతో మృతి చెందిన ఎనిమిది శునకాల కళేబరాలను అక్కడి నుంచి తొలగించి ఆస్పత్రి సమీపంలో పూడ్చి పెట్టించారు.
ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణ, చంద్రకళతో కలిసి సమావేశం నిర్వహించారు. ఎన్నికల అధికారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు.
జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా పాఠశాలను సందర్శించారు. విచారణ జరిగిన సమయంలో మీడియాను, ఇతరులను లోనికి అనుమతించలేదు.