Share News

ఇండస్ర్టియల్‌ హబ్‌తో పారిశ్రామికంగా అభివృద్ది

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:06 PM

వేంపల్లి గ్రామం ఇండస్ర్టియల్‌ హబ్‌గా మారడం వల్ల పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అన్నారు. మంగళవారం పద్మనాయక ఫంక్షన్‌ హాలులో భూదాతలతో సమావేశమయ్యారు. భూములను ఇండస్ర్టియల్‌ హబ్‌ కోసం స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలిపారు.

ఇండస్ర్టియల్‌ హబ్‌తో పారిశ్రామికంగా అభివృద్ది

మంచిర్యాల క్రైం, జనవరి 7(ఆంధ్రజ్యోతి) : వేంపల్లి గ్రామం ఇండస్ర్టియల్‌ హబ్‌గా మారడం వల్ల పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అన్నారు. మంగళవారం పద్మనాయక ఫంక్షన్‌ హాలులో భూదాతలతో సమావేశమయ్యారు. భూములను ఇండస్ర్టియల్‌ హబ్‌ కోసం స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేంసాగర్‌రావు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ భూములను ఇచ్చిన వారికి పరిహారం నెలలోపు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఎకరానికి పదమూడున్నర లక్షలు పరిహారంగా చెల్లిస్తామని తెలిపారు. పరిహారంతోపాటు దసరా నాటికి అన్ని సౌకర్యాలతో ఇల్లు నిర్మించి అప్పగిస్తానని చెప్పారు.

పరిశ్రమల ఏర్పాటు తర్వాత భూనిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని ఎల్లంపల్లి నిర్వాసితులకు ఇప్పటికి పరిహారం అందలేదని గుర్తు చేశారు. పారిశ్రామిక రంగం అభివృద్ధి విషయంలో ఎవరు అడ్డుపడిన సహించబోమని స్పష్టం చేశారు. విపక్షాలు అభివృద్ధి ని అడ్డుకోవాలనే కుట్ర పన్నాయని ఆరోపించారు. బీజేపీ వ్యాపార పార్టీ అని, ఓట్ల కోసం మతం జపం చేస్తుందని, బీఆర్‌ఎస్‌ దుకాణం మూతపడిందని అన్నారు. బీఆరెస్‌ పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఏమి చేయలేక పోయిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. ప్రజలకు మాట ఇచ్చానంటే ఎట్టిపరిస్థితుల్లో తప్పనని తప్పితే పదవికి రాజీనామా చేస్తానన్నారు. నాయకులు, కార్యకర్తలు, వేంపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:06 PM