భూములను దౌర్జన్యంగా లాక్కొంటోంది
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:04 PM
మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, పోచంపహాడ్ శివారులో ఇండస్ర్టియల్ హబ్ కోసం పేద రైతుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటుందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం ముల్కల్లలోని దళిత రైతులను కలిశారు. ఆయన మాట్లాడుతూ ముల్కల్ల, వేంపల్లి, పోచంపహాడ్‌లో ఇండస్ర్టియల్ పార్కు కోసం సుమారు 295 ఎకరాల భూమి సేకరణకు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అనుచరులు గ్రామాల్లోని దళిత రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
హాజీపూర్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, పోచంపహాడ్ శివారులో ఇండస్ర్టియల్ హబ్ కోసం పేద రైతుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటుందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం ముల్కల్లలోని దళిత రైతులను కలిశారు. ఆయన మాట్లాడుతూ ముల్కల్ల, వేంపల్లి, పోచంపహాడ్‌లో ఇండస్ర్టియల్ పార్కు కోసం సుమారు 295 ఎకరాల భూమి సేకరణకు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అనుచరులు గ్రామాల్లోని దళిత రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసులు, జీవోలు ఇవ్వకుండా ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను గుంజుకుంటే బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని, అప్పటి ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన భూములను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటోందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి దౌర్జన్యం ఎంత ఉందో, అంతకంటే పదిరెట్లు మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు దౌర్జన్యం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో కాంగ్రెస్‌ను ఎందుకు గెలిపించారని ప్రజలు బాధపడుతున్నారన్నారు.
ఇండస్ర్టియల్ హబ్ కోసం కోసం ఇచ్చే భూముల్లో మార్కెట్ ధర సుమారు రూ.50 లక్షలు ఉంటుందని, ఎమ్మెల్యే సమావేశం పెట్టి భూముల ధరలను రూ.13 లక్షలుగా నిర్ణయించారని, ఏ ప్రాతిపదికన ఎకరానికి రూ.13 లక్షలు నిర్ణయించారో చెప్పాలన్నారు. రైతుల నుంచి భూములు తీసుకోవాలంటే వారికి మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలన్నారు.ముల్కల్ల, వేంపల్లిలోని కాంగ్రెస్ నాయకులు సతీష్‌గౌడ్, సంజయ్‌రావులు ఈ భూములను లాక్కునేందుకు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ తన హయాంలో వేంపల్లి, ముల్కల్ల గ్రామాల్లోని రైతులకు ఒక్కో కుటుంబానికి 20 గుంటల చొప్పున 45 మందికి ఇప్పించానన్నారు. వీరు ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారని, ప్రభుత్వం తక్కువ ధరకు భూమిని తీసుకుంటే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. రైతులు, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం బీఆర్‌ఎస్ పోరాటాలు చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు విజిత్‌రావు, సందెల వెంకటేష్, రవీందర్‌రెడ్డి, అంకం నరేష్, వెంకటేశ్వర్‌రావు, మంచాల శ్రీనివాస్, సత్యం, తదితరులు పాల్గొన్నారు.