Home » Manifesto
రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న శక్తులకు, వాటిని పరిరక్షించేందుకు నడుం బిగించిన శక్తులకు మధ్య జరుగుతున్న పోరాటమే 2024 లోక్‌సభ ఎన్నికలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల తర్వాతే 'ఇండియా' కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక ఉంటుందని చెప్పారు.
నేడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. రైతులు, మహిళలు, యూత్ టార్గెట్‌గా ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో నోట్ల ముద్రణ ఏమైనా చేస్తారేమో... తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు పేల్చారు.
లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం కాంగ్రెస్ ( Congress ) పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. పాంచ్ న్యాయ్ సూత్రం ఆధారంగా ఒక్కోన్యాయ్ కింద ఐదు హామీలు చొప్పున మొత్తం కింద 25 హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునే విధంగా మేనిఫెస్టోలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నేడు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Elections ) మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
సార్వత్రిక ఎన్నికలు-2024కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఏర్పాట్లలో బిజీగా ఉంది. మరోవైపు గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలలో ముందున్న భారతీయ జనతా పార్టీ కీలకమైన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని శనివారంనాడు ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన 27 మందితో కమిటీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికలు - 2024కు సంబంధించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ ( Congress ) ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో విడుదల అనంతరం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనుంది.
పశ్చిమబెంగాల్ నుంచి లోక్‌సభకు పోటీ చేసే 12 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత జగన్‌లో రోజురోజుకు ఓటమి భయం పెరుగుతుందా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ఆందోళన చెందుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. ఈనెల 20వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ తాజాగా మేనిఫెస్టో విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు పూర్తయిందన్న వైసీపీ వెనక్కి తగ్గడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ ఉమ్మడి మేనిఫెస్టో తో ప్రజల ముందుకు వెళ్తుందా? అనే ప్రశ్నకు 'లేదనే' మాట వినిపిస్తోంది. కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు సొంత మేనిఫెస్టోలు ఉంటాయని, అయితే ఉమ్మడి ఎజెండా మాత్రం ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.