Share News

RJD Manifesto: కోటి ఉద్యోగాలు ఇస్తాం, రక్షా బంధన్‌కు యువతులకు లక్ష .. ఆర్జేడీ మ్యానిఫెస్టోలో ఇంకా..

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:26 AM

లోక్‌సభ 2024 ఎన్నికలు(Lok Sabha elections 2024) మరికొన్ని రోజుల్లో మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, RJD నేత తేజస్వి యాదవ్‌(Tejashwi Yadav)తో పాటు ఇతర పార్టీ నేతలు 'పరివర్తన్ పత్ర' పేరుతో 2024 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను(RJD Manifesto) విడుదల చేశారు.

RJD Manifesto: కోటి ఉద్యోగాలు ఇస్తాం, రక్షా బంధన్‌కు యువతులకు లక్ష .. ఆర్జేడీ మ్యానిఫెస్టోలో ఇంకా..
RJD Manifesto 2024

లోక్‌సభ 2024 ఎన్నికలు(Lok Sabha elections 2024) మరికొన్ని రోజుల్లో మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, RJD నేత తేజస్వీ యాదవ్‌(Tejashwi Yadav)తో పాటు ఇతర పార్టీ నేతలు 'పరివర్తన్ పత్ర' పేరుతో 2024 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను(RJD Manifesto) విడుదల చేశారు. ఈ సదంర్భంగా తాము 2024లో 24 వాగ్దానాలను తీసుకొస్తున్నామని, నిబద్ధతతో నెరవేరుస్తామని చెప్పారు. అంతేకాదు ఇవి బీహార్ అభివృద్ధికి చాలా ముఖ్యమని ఆయన తెలిపారు.


ఇండియా కూటమి అలయన్స్ ప్రభుత్వం ఏర్పడితే దేశవ్యాప్తంగా కోటి మంది యువతకు ఉద్యోగాలు(one crore jobs) కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 30 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మిగతా 70 లక్షల పోస్టులు సృష్టించబడతాయని చెప్పారు. దీంతోపాటు రక్షాబంధన్ రోజున పేద సోదరిమణులకు ఏటా రూ.లక్ష బహుమతిగా ఇస్తామని తేజస్వీ యాదవ్ అన్నారు. బీహార్‌లో మెరుగైన కనెక్టివిటీ కోసం పూర్నియా, భాగల్‌పూర్, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, రక్సాల్‌లలో 5 కొత్త విమానాశ్రయాలను నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఓపీఎస్ (పాత పెన్షన్ స్కీం) అమలు చేసి బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు.


ఈ నేపథ్యంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆగస్టు 15 నుంచి ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ ప్రారంభమవుతుందని తేజస్వీ యాదవ్‌(Tejashwi Yadav) వెల్లడించారు. నిరుపేద కుటుంబాల అక్కాచెల్లెళ్లకు ఏటా రూ.500కే గ్యాస్ సిలిండర్లు(LPG Gas), బీహార్‌లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని RJD హామీ ఇచ్చింది.

మరోవైపు ప్రధానమంత్రి మోదీ(narendra modi) ప్రజా సమస్యలు, పనులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారు కేవలం తమ భావాలను వ్యక్తం చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లలో బీహార్‌కు ఏం ఇచ్చారని ప్రశ్నించారు. మీరు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని అడిగారు. సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి ఇతర విషయాల గురించి మాట్లాడుతున్నారని తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు.


ఇది కూడా చదవండి:

SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి

Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్


మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 13 , 2024 | 11:53 AM