Home » Manipur Violence
ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు జరుపుకుంటున్న వేళ.. గురువారం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మణిపూర్ ప్రజలకు సంబంధించిన ఫోటోను ఆయన షేర్ చేశారు. జాతుల మధ్య వైషమ్యాల కారణంగా మణిపూర్ ప్రజలకు ఓదార్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఆయన సూచించారు.
2015, ఆగస్ట్‌లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా రేఖా శర్మ నియమితులయ్యారు. అనంతరం 2017, సెప్టెంబర్ 29న కమిషన్ చైర్ పర్సన్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2018లో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. నాటి నుంచి మంగళవారం వరకు ఆమె.. ఈ చైర్ పర్సన్ పదవిలో కొనసాగారు.
మణిపూర్‌లోని జిరిబమ్‌లో భద్రత దళాల కాన్వాయిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు. మణిపూర్‌లో జాతుల మధ్య సంఘర్ణణకు ముగింపు పలికేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె విజ్జప్తి చేశారు.
మణిపూర్‌లో జిరిబం జిల్లాలోని మాంగ్‌బంగ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్ఫ(సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) జవాన్ మృతి చెందారు.
మణిపూర్‌లో శాంతి స్థాపన అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో బలంగా మాట్లాడతామని కాంగ్రెస్, ఇండియా కూటమి తరఫున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో గతేడాది మేలో ఘర్షణలు చెలరేగాయి. దాంతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో మణిపూర్‌ను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విజ్జప్తి చేశారు.
మణిపుర్లో(Manipur Riots) గతేడాది జరిగిన హింసలో బాధితులను పరామర్శించడానికి ప్రధాని మోదీకి(PM Modi) సమయం ఉండట్లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్(Jairam Ramesh) విమర్శించారు. ఒక్కసారీ మణిపుర్‌కి రాని మోదీ.. విదేశీ పర్యటనకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం మణిపూర్‌కి వెళ్లడానికి ముందు అస్సాంలోని కాచార్ జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్నారు. ఫులెర్తాల్ వద్ద వరద సహాయక శిబిరాన్ని సందర్శించి..
మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్రం దృష్టి సారించింది. ఆ క్రమంతో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఈ సందర్బంగా చర్చించారు.
గతేడాది మే 3న మణిపూర్ ప్రారంభమైన హింస నేటికీ కొనసాగుతోందని, కుటుంబ సభ్యులతోపాటు ఇళ్లు, ఆస్తులు, కుటుంబాలను కోల్పోయిన వేలాదిమంది నిరాశ్రయులయ్యారని హైదరాబాద్‌లో నివసిస్తున్న మణీపూర్(Manipur) కూకీ-జో తెగలకు చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు.