Share News

Manipur: ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో రైఫిళ్లు చోరీ.. ఐదుగురు అరెస్ట్

ABN , Publish Date - Aug 30 , 2024 | 08:11 AM

మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో రైఫిళ్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సెక్‌మై లీకింతబీలోని బీజేపీ ఎమ్మెల్యే జాయ్ కిషన్ సింగ్ ఫామ్‌హౌస్‌లోని మూడు రైఫిళ్లను దుండగులు దొంగిలించారు.

Manipur: ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో రైఫిళ్లు చోరీ.. ఐదుగురు అరెస్ట్

ఇంఫాల్, ఆగస్ట్ 30: మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో రైఫిళ్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సెక్‌మై లీకింతబీలోని బీజేపీ ఎమ్మెల్యే జాయ్ కిషన్ సింగ్ ఫామ్‌హౌస్‌లోని మూడు రైఫిళ్లను దుండగులు దొంగిలించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు వారిలో నలుగురు పోలీసులు ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపరచగా.. 10 రోజుల పోలీసుల కస్టడీ విధించింది.

Also Read: Sri Lanka: దేశాధ్యక్షుడు ఎన్నికల వేళ.. కొలంబోకు అజిత్ దోవల్


ఫామ్ హౌస్ కాపలాగా ఉన్న గ్రామ రక్షక దళాన్ని బెదిరించి.. వీరు ఈ చోరీకి పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. చోరికి గురైన ఈ రైఫిళ్లు.. బుల్లెట్లతో నింపి ఉన్నాయని వెల్లడించారు. తంగ్‌మీబాండ్‌ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా జాయ్ కిషన్ సింగ్ విజయం సాధించారు.


పశ్చిమ ఇంఫాల్, తూర్పు ఇంపాల్‌లో్ మెయితీ తెగల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. అలాగే గతేడాది మెయితీ, కూకీ తెగల మధ్య ఘర్షణల్లో భాగంగా ఈ తరహా ఆయుధాల చోరీ ఘటనలు చోటు చేసుకున్నాయి. గతేడాది ఈ రెండు తెగల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో 126 మంది ప్రజలు మరణించారు. అలాగే దాదాపు 60 వేల మందికిపైగా ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 08:19 AM