Share News

Manipur: భారీగా ప్రవేశించిన తీవ్రవాదులు: దాడులకు అవకాశం

ABN , Publish Date - Sep 21 , 2024 | 02:32 PM

పొరుగునున్న మయన్మార్ నుంచి భారత్‌లోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోకి భారీగా కూకీ తీవ్రవాదులు ప్రవేశించారని నిఘా సంస్థ స్పష్టం చేసింది. దాదాపు 900 మంది కూకీ తీవ్రవాదులు మణిపూర్‌లోకి ప్రవేశించారని తెలిపింది. 30 మంది సభ్యులతో ఒక బృందంగా వీరాంత రాష్ట్రంలోని ప్రవేశించారని పేర్కొంది.

Manipur: భారీగా ప్రవేశించిన తీవ్రవాదులు: దాడులకు అవకాశం

ఇంఫాల్, సెప్టెంబర్ 21: పొరుగునున్న మయన్మార్ నుంచి భారత్‌లోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోకి భారీగా కూకీ తీవ్రవాదులు ప్రవేశించారని నిఘా సంస్థ స్పష్టం చేసింది. దాదాపు 900 మంది కూకీ తీవ్రవాదులు మణిపూర్‌లోకి ప్రవేశించారని తెలిపింది. 30 మంది సభ్యులుగా ఒక్కొ బృందం భారత్‌లోకి ప్రవేశించిందని పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీరంతా తలదాచుకున్నారని చెప్పింది.

Also Read: తాడేపల్లి టు బెంగళూరు.. షటిల్ సర్వీస్


సెప్టెంబర్ చివరి వారంలోగా మెయితీ తెగవారిపై వీరంతా దాడి చేసే అవకాశాలున్నాయని పేర్కొంది. మణిపూర్‌లో ప్రవేశించిన ఈ తీవ్రవాదులంతా డ్రోనులు, ప్రొజెక్టైల్స్, మిసైల్స్, అటవీ ప్రాంతంలో యుద్దం చేయడంలో శిక్షణ పొందారని వివరించింది. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నిఘా సంస్థ నివేదిక అందజేసింది. ఈ నివేదికను ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి నిఘా సంస్థ స్పష్టం చేసింది.

Also Read: Anna Sebastian: సెబీ జోసఫ్‌ను కలిసిన ఎంపీ శశిథరూర్


దీనిపై మణిపూర్‌ భద్రతా సలహాదారు కులదీప్ సింగ్ స్పందించారు. నిఘా సంస్థ అందించిన నివేదికతో అప్రమత్తమైనట్లు తెలిపారు. ఇది నూటికి నూరు శాతం వాస్తవమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రోనులు ఎగరవేతపై నిషేధం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భద్రతా సంస్థలు సైతం డ్రోనులు ఎగర వేయకూడదని తెలిపారు. ఓ వేళ డ్రోనులు ఎగరవేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పని సరి అని కులదీప్ సింగ్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాతోపాటు మయన్మార్, మణిపూర్‌ సరిహద్దు జిల్లాలోని ఎస్పీలకు సైతం ఈ నిఘా సంస్థ అందజేసిన నివేదికను పంపినట్లు తెలిపారు.

Also Read: Delhi CM: నేడు సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం

Also Read: Kolkata: ముగిసిన సమ్మె.. నేటి నుంచి విధుల్లోకి జూనియర్ డాక్టర్లు


ఇంకోవైపు భారత సైన్యంతోపాటు మణిపూర్ పోలీసులు ఇంఫాల్ తూర్పు జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది మేలో మణిపూర్‌లోని మెయితీ, కూకీ తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 200 మందికిపైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

For More National News And Telugu News...

Updated Date - Sep 21 , 2024 | 03:18 PM