Manipur Issue: ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ మళ్లీ విజ్ఞప్తి
ABN , Publish Date - Aug 15 , 2024 | 08:46 PM
ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు జరుపుకుంటున్న వేళ.. గురువారం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మణిపూర్ ప్రజలకు సంబంధించిన ఫోటోను ఆయన షేర్ చేశారు. జాతుల మధ్య వైషమ్యాల కారణంగా మణిపూర్ ప్రజలకు ఓదార్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఆయన సూచించారు.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 15: జాతుల మధ్య హింస కారణంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పని చేస్తున్నాయనే భావన మణిపూర్ ప్రజల్లో సాధ్యమైనంత త్వరగా తీసుకు రావాలని ప్రధాని మోదీకి ఈ సందర్బంగా రాహుల్ గాంధీ సూచించారు.
Also Read: Suvendu Adhikari: ఆర్‌జీ కార్ ఆసుపత్రిపై దాడి.. హోం శాఖ కార్యదర్శికి లేఖ
ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు జరుపుకుంటున్న వేళ.. గురువారం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మణిపూర్ ప్రజలకు సంబంధించిన ఫోటోను ఆయన షేర్ చేశారు. జాతుల మధ్య వైషమ్యాల కారణంగా మణిపూర్ ప్రజలకు ఓదార్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఆయన సూచించారు.
Also Read: Akasa Air Flight: భోపాల్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుడు మృతి
Also Read: RG Kar Medical College Student: కుమార్తె చనిపోయే ముందు డైరీలో ఏం రాసిందంటే..
గతేడాది మేలో మణిపూర్‌లోని కుకీ, మెయితీ జాతుల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 200 మందికిపైగా మరణించారు. ఈ ఘర్షణ చోటు చేసుకున్న నాటి నుంచి ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ మూడు సార్లు పర్యటించారు. జులైలో సైతం రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంఫాల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ చాలా కాలం క్రితం మణిపూర్‌లో పర్యటించారన్నారు.
Also Read: Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతానికి శుభ ముహూర్తం ఇదే..
Also Read: Jammu Kashmir Assembly Elections: డీజీపీగా నళిన్ ప్రభాత్
Also Read: Sunita Kejriwal: సీఎం కేజ్రీవాల్ సతీమణి తీవ్ర అసంతృప్తి.. ఎందుకంటే..?
ఆయన మరోసారి ఈ రాష్ట్రంలో పర్యటించి.. మణిపూర్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. మణిపూర్ ప్రజలే కాదు.. దేశ ప్రజలంతా ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించాలని కోరుకుంటున్నారని తెలిపారు. అలా పర్యటించడం ద్వారా ఆ రాష్ట్ర ప్రజల భావాలను ప్రధాని మోదీ తెలుసుకుంటారనే భావన వారిలో వ్యక్తమవుతుందని చెప్పారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ తన వంతు సహకారం అందిస్తుందని ప్రధాని మోదీకి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Also Read: Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతం వేళ.. ఏ రంగు చీర కట్టుకోవాలంటే..
Read More National News and Latest Telugu News