Home » Manipur Violence
మైతేయీ, కుకీ జాతుల మధ్య వైరంతో దాదాపు మూడు నెలలుగా అట్టుడికిపోతున్న మణిపూర్‌లో (Manipur Violence) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నెట్ సేవలను పాక్షికంగా పునరుద్ధరిస్తూ మణిపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రాండ్‌బ్యాండ్ సేవలు పొందేందుకు అనుమతినిచ్చింది. స్థిరమైన ఒకే ఒక్క ఐపీ కనెక్షన్ (static IP connection) ఉన్న ఇంటర్నెట్ పరిమితంగా వినియోగించుకోవచ్చని పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.